flydubai attacker | ఉగ్రవాద భావజాలం.. విమానాలు నడపడంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైలట్ గురించి సంచలన విషయాలు
flydubai attacker | ఫైదుబాయ్ (flydubai) ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనకు పాల్పడిన కో పైలట్ హమామ్ అల్‌హమామి (Hamam Alhamami) ఒమన్ (Oman) దేశస్థుడిగా అధికారులు గుర్తించారు. అతడు విమానాలు నడపకుండా ఒమన్ ప్రభుత్వం గతంలో నిషేధం విధించినట్లు తేలింది.
International | Published On Oct 3, 2026, 10.32 am IST
flydubai attacker | త్రినేత్ర న్యూస్ : దుబాయ్ టు టెల్ అవీవ్ (Dubai-Tel Aviv flight) బయల్దేరిన ఫ్లైదుబాయ్ (flydubai) విమానంలో కో-పైలట్ విధ్వంసానికి యత్నించి భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Captain Smit Machchhar)పై దాడి చేసిన ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనకు పాల్పడిన కో పైలట్ హమామ్ అల్‌హమామి (Hamam Alhamami) ఒమన్ (Oman) దేశస్థుడిగా అధికారులు గుర్తించారు. అతడు విమానాలు నడపకుండా ఒమన్ ప్రభుత్వం గతంలో నిషేధం విధించినట్లు తేలింది. అతడు తీవ్రవాద భావజాలం కలిగి ఉన్నాడన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. అల్‌హమామి ఒమన్ దేశస్థుడే అయినప్పటికీ ఆయన ఎక్కువగా సిరియాలోనే గడిపాడు. అక్కడ ఆయన తీవ్రవాద భావజాలానికి ప్రభావితమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2024లో ఒమన్ ఎయిర్‌లో కో పైలట్ ట్రైనీగా పనిచేశాడు. ఆ సమయంలో అతడి ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి వద్ద తీవ్రవాద సామగ్రిని అధికారులు గుర్తించారు. దీన్ని భద్రతాపరమైన ముప్పుగా భావించిన ఒమన్ అధికారులు.. విమానాలు నడపకుండా అతడిపై నిషేధం విధించారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ విధుల్లో కొనసాగించారు.
విమానాలు నడపడంపై నిషేధం ఉన్నప్పటికీ అతడు అంతర్జాతీయ సంస్థల్లో కో పైలట్‌గా పనిచేస్తూ వస్తున్నారు. ఒమన్ ఎయిర్‌లో ఏడేళ్లపాటు పనిచేసి 2025 ఫిబ్రవరిలో ఆ ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత 2025 జూన్‌లో రాయ్ ఎయిర్ మొరాకోలో చేరి, ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఫ్లైదుబాయ్‌లో చేరాడు. అయితే, విమాన ఘటన జరిగిన దాదాపు తొమ్మిది గంటల్లోనే ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఉగ్రవాద సంబంధిత రెండు పోస్టులు వెలువడినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
మొదట పోస్టులో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కాక్‌పిట్ నుండి తీసిన కొన్ని వీడియో క్లిప్‌లు ఉన్నాయి. అందులో ఇజ్రాయెల్‌కు చెందిన El Al ఎయిర్‌లైన్స్ విమానాన్ని జూమ్ చేసి చూపించారు. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అల్-ఖైదాను నడిపిన ఉగ్రవాది అయ్మాన్ అల్-జవాహిరి ఫోటోతో పాటు, అమెరికాలో 2009లో ఆత్మాహుతి దాడి చేసి తొమ్మిది మందిని పొట్టనబెట్టుకున్న హుమమ్ ఖలీల్ అబూ-ములాల్ అల్-బలవి ఫోటోలు ఆ వీడియోలో కనిపించాయి. ఇక రెండో పోస్టులో మక్కా, మదీనా, జెరూసలేంలోని ఇస్లాంకు చెందిన మూడు అత్యంత పవిత్ర స్థలాలను చూపించే ఏఐ చిత్రాలు ఉన్నాయి. దీంతో ఉద్దేశపూర్వకంగానే అతడు దాడి చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
Also Read..
హెల్త్‌కేర్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. ఐదుగురు దుర్మరణం
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. క్యాన్సర్‌తో నల్లగొండ యువతి మృతి
ఈ నెల 4, 5 తేదీల్లో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
అక్టోబర్ 2, 2026

Captain Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ గరిమా అవార్డు
అక్టోబర్ 1, 2026

Captain Smit Machchhar | ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియన్ పైలట్‌పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Rachita Ram | హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని - పబ్లిక్‌గా ఇదేం పని అంటూ నెటిజన్ల ఫైర్
- ●Manali | లాంగ్ వీకెండ్.. మనాలీకి క్యూ కట్టిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
- ●Boiler Blast | హెల్త్‌కేర్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. నలుగురు దుర్మరణం
- ●Manvitha Reddy | ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. క్యాన్సర్‌తో నల్లగొండ యువతి మృతి
- ●Special Train | ఈ నెల 4, 5 తేదీల్లో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..
- ●Kumkum Mohod | రికర్వ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో కుమ్కుమ్ సరికొత్త చరిత్ర

Rachita Ram | హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని - పబ్లిక్‌గా ఇదేం పని అంటూ నెటిజన్ల ఫైర్

Manali | లాంగ్ వీకెండ్.. మనాలీకి క్యూ కట్టిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్

Boiler Blast | హెల్త్‌కేర్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. నలుగురు దుర్మరణం

Manvitha Reddy | ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. క్యాన్సర్‌తో నల్లగొండ యువతి మృతి



