త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OM vs AOT | ఓం వ‌ర్సెస్ ఆకాశంలో ఒక తార – రెండు రోజుల్లో ఏ సినిమాకు ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయంటే?

ధ‌నుష్ ఓం మూవీ మిక్స్‌డ్ టాక్‌తో భాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 60 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. మ‌రోవైపు దుల్క‌ర్ స‌ల్మాన్ ఆకాశంలో ఒక తార టాక్ బాగుంది. కానీ వ‌సూళ్ల విష‌యంలో ధ‌నుష్ సినిమాకు పోటీ ఇవ్వ‌లేక‌పోతుంది. రెండు రోజుల్లో ఆకాశంలో ఒక తార 13 కోట్ల క‌లెక్ష‌న్లు ద‌క్కించుకుంది.

N

Entertainment | Published On Nov 22, 2026, 9.07 pm IST

OM vs AOT | ఓం వ‌ర్సెస్ ఆకాశంలో ఒక తార – రెండు రోజుల్లో ఏ సినిమాకు ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయంటే?
Advertisement

OM vs AOT | ఈ శుక్ర‌వారం దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన ఆకాశంలో ఒక తార‌తో పాటు ధ‌నుష్ త‌మిళ డ‌బ్బింగ్ మూవీ ఓం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఆకాశంలో ఒక తార ఎమోష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్క‌గా...ఓం సినిమా ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందింది. రెండు రోజుల్లో ఈ రెండు సినిమాల క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయంటే?

మిక్స్‌డ్ టాక్‌....

ధ‌నుష్ ఓం మూవీ మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినిమా అర‌వై కోట్ల గ్రాస్‌, 28 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. అత్య‌ధికంగా త‌మిళ వెర్ష‌న్‌కు 17 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. క‌లెక్ష‌న్ల ప‌రంగా త‌మిళం త‌ర్వాత తెలుగు సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ధ‌నుష్ సినిమా తొలిరోజు ఐదు కోట్ల ప‌ది ల‌క్ష‌ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌గా...రెండో రోజు 4.20 కోట్ల వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో తెలుగు వెర్ష‌న్ 9.30 కోట్ల గ్రాస్‌, మూడు కోట్ల మేర షేర్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

ప్రీ రిలీజ్ బిజినెస్‌...

తెలుగులో ఓం ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. తొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ధ‌నుష్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మ‌రో నాలుగు కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టాల్సి ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఓం సినిమాకు రాజ్‌కుమార్ పెరియాసామీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాయిప‌ల్ల‌వి, శ్రీలీల హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాలో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషించారు. తెలుగులో ఈ సినిమాను సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ రిలీజ్ చేశారు.

ఆకాశంలో ఒక తార‌...

దుల్క‌ర్ స‌ల్మాన్ ఆకాశంలో ఒక తార మూవీ తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శుక్ర‌వారం తెలుగులో ఈ సినిమాకు రెండు కోట్ల ప‌దిహేను ల‌క్ష‌ల వ‌సూళ్లు రాగా....రెండోరోజు మూడు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల‌తో పిక‌ప్ అయ్యింది. ఓవ‌రాల్‌గా తెలుగులో రెండు రోజుల్లో 5.30 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌, 2.75 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను ఈ ఎమోష‌న‌ల్ డ్రామా మూవీ ద‌క్కించుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 13 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

ఆకాశంలో ఒక తార సినిమాకు ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాత్విక వీర‌వ‌ల్లి హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో శృతి హాస‌న్‌, రుహానీ శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు.

 

Advertisement
Advertisement