Nayanthara | నయనతారకు 10 కోట్ల లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విఘ్నేశ్ శివన్!
లేడీ సూపర్ స్టార్ నయనతారకు కాస్ట్‌లీ బర్త్‌డే గిఫ్ట్‌ను ఇచ్చాడు కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. నయనతార ఇటీవలే తన 42వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది. భార్యకు పది కోట్ల విలువైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చాడు విఘ్నేష్ శివన్.
Entertainment | Published On Nov 22, 2026, 7.41 pm IST
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ బహుమతి తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. నవంబర్ 18న నయనతార తన 42వ బర్త్‌డేను జరుపుకుంది. పుట్టినరోజు సందర్భంగా భార్యకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు విఘ్నేష్ శివన్. నయనతారకు పది కోట్ల విలువైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును బహుమతిగా ఇచ్చాడు.
కారుతో నయనతార, విఘ్నేష్ శివన్‌తో పాటు వారి కవల పిల్లలు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతోన్నాయి.
మూడు కోట్లు....
గత ఏడాది భర్త విఘ్నేష్ శివన్ బర్త్‌డేకు నయనతార అతడికి మూడు కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు విఘ్నేష్ శివన్ ఏకంగా నయనతారకు పది కోట్ల కారును బహుమతిగా ఇవ్వడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
నాలుగు సెకండ్లలో...
రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్స్ స్పెక్టర్ ఎలక్ట్రికల్ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం నాలుగు సెకండ్లలోనే అందుకుంటుంది. గంటకు 250 కిలోమీటర్ల స్పీడుతో వెళుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
పాన్ ఇండియన్ సినిమాలతో...
యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పలు పాన్ ఇండియన్ సినిమాలతో నయనతార బిజీగా ఉంది. తమిళంలో రజనీకాంత్ ధర్మన్‌తోపాటు మరోమూడు సినిమాలు చేస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్, వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీలో లేడీ సూపర్ స్టార్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఇటీవలే మూక్కుత్తి అమ్మన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది నయనతార. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మైథాలజీ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
సంబంధిత వార్తలు

Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ – సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్
నవంబర్ 20, 2026

OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్- టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్
నవంబర్ 20, 2026

Anirudh, Kavya Maran | భార్యతో రొమాంటిక్ ఫోజులు – పెళ్లి ఫొటోలు షేర్ చేసిన అనిరుధ్
నవంబర్ 19, 2026
తాజావార్తలు
- ●PVNRTVU | వెటర్నరీ వర్సిటీలో 117 అధ్యాపక పోస్టులు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్!
- ●Nvidia Chip Smuggling China | ఎన్విడియా చిప్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపు.. ఆలిస్ హువాంగ్ వెనుక అసలు సూత్రధారి చైనా వ్యాపారవేత్త
- ●Bomb Threat Email | హైదరాబాద్‌లో బాంబు దాడులు చేస్తం.. బెదిరింపు మెయిల్ కలకలం
- ●Maruti Suzuki | మారుతి కార్ల ధరలకు మరోసారి రెక్కలు.. నేటి నుంచే కొత్త రేట్లు!
- ●CM Revanth Reddy | నన్నే కమాండ్ చేస్తరా? కలిసుందామా? కొట్టుకుందామా?
- ●Sudhakar Son | హీరోగా మారిన కమెడియన్ సుధాకర్ కొడుకు - ఒకే రోజు రెండు సినిమాలతో బాక్సాఫీస్ బరిలో...

PVNRTVU | వెటర్నరీ వర్సిటీలో 117 అధ్యాపక పోస్టులు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్!

Nvidia Chip Smuggling China | ఎన్విడియా చిప్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపు.. ఆలిస్ హువాంగ్ వెనుక అసలు సూత్రధారి చైనా వ్యాపారవేత్త

Bomb Threat Email | హైదరాబాద్‌లో బాంబు దాడులు చేస్తం.. బెదిరింపు మెయిల్ కలకలం

Maruti Suzuki | మారుతి కార్ల ధరలకు మరోసారి రెక్కలు.. నేటి నుంచే కొత్త రేట్లు!



