Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి
Uber | ఉబర్ (Uber) సంస్థ ఉద్యోగులకు (employees) షాకిచ్చింది. ఇప్పటికే లేఆఫ్స్ ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి (work from home) స్వస్తి పలికింది. ఇకపై గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో కేవలం ఒక్క శాతం మందికి మాత్రమే పూర్తిగా రిమోట్‌గా పనిచేసే వెసులుబాటు కల్పిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
Uber | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ రైడ్-హెయిలింగ్ దిగ్గజం 'ఉబర్' (Uber) తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సుమారు 3,300 ఉద్యోగాలను (employees) తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంస్థ.. మిగిలిన ఉద్యోగుల పని విధానంలోనూ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొవిడ్ మహమ్మారి నుంచి అమలు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) విధానానికి పూర్తిగా ముగింపు పలికింది. ఇకపై గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో కేవలం ఒక్క శాతం మందికి మాత్రమే పూర్తిగా రిమోట్‌గా పనిచేసే వెసులుబాటు కల్పిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి సమయం నుంచి మెజారిటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారని.. వారంతా ఇకపై ఆఫీస్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం పూర్తిగా రిమోట్ వర్క్ చేస్తున్న ఉద్యోగులు తమ టీమ్స్ ఉన్న ఆఫీసు ప్రాంతాలకు మూవ్ అవ్వాలని తెలిపింది. అంతేకాదు, మేనేజర్లు కూడా వీలైనంత వరకూ తమ టీమ్స్ ఉన్న చోటే ఉండాలని ఆదేశించింది. అదే సమయంలో ఉద్యోగులకు ఉబర్ కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. వారానికి ఐదు రోజులు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న హైబ్రిడ్ విధానం యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. అయితే, ఈ నిబంధనను ఉద్యోగులు కచ్చితంగా పాటించేలా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
కాగా, ప్రపంచవ్యాప్తగా 3,300 మందిని తొలగిస్తున్నట్లు సంస్థ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మొత్తం ఉద్యోగుల్లో 10శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉబర్‌లో దాదాపు 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
Also Read..
టాలీవుడ్‌లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?
‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!
సంబంధిత వార్తలు

Employees Protest | సెక్రెటేరియట్ వద్ద ఉద్యోగుల భారీ నిరసన.. డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు
సెప్టెంబర్ 1, 2026

Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు
ఆగస్టు 28, 2026

Eatala Rajendar | రేవంత్! ఆటో డ్రైవర్లకు ఏం చేస్తే మంచిదో.. అది చేయండి
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Ekta Ratod | టాలీవుడ్‌లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?
- ●స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- ●Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!
- ●Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
- ●Vijay Mallya | బ్రిటన్ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..
- ●oxygen cylinder explodes | పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి

Ekta Ratod | టాలీవుడ్‌లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!

Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?



