త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ekta Ratod | టాలీవుడ్‌లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్‌.. తొలి సినిమాతో హిట్‌ కొట్టేనా..?

Ekta Ratod | కన్నడ చిత్రసీమలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఏక్తా రాథోడ్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా సాయికిరణ్‌ రెడ్డి దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెగసీ’తో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ చిత్రంలో విశ్వక్‌సేన్‌, ఏక్తా రాథోడ్‌తో పాటు కేకే మేనన్‌, రావు రమేశ్‌, సచిన్‌ ఖేడేకర్‌, మురళీమోహన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

P

Entertainment | Published On Sep 9, 2026, 2.05 pm IST

Ekta Ratod | టాలీవుడ్‌లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్‌.. తొలి సినిమాతో హిట్‌ కొట్టేనా..?
Advertisement

Ekta Ratod | కన్నడ చిత్రసీమలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఏక్తా రాథోడ్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా సాయికిరణ్‌ రెడ్డి దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెగసీ’తో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ చిత్రంలో విశ్వక్‌సేన్‌, ఏక్తా రాథోడ్‌తో పాటు కేకే మేనన్‌, రావు రమేశ్‌, సచిన్‌ ఖేడేకర్‌, మురళీమోహన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

కన్నడలో ఇలా..

బెంగళూరుకు చెందిన ఏక్తా రాథోడ్‌ మోడలింగ్‌ నుంచి నటన వైపు అడుగులు వేసింది. కన్నడలో ‘మాస్టర్‌పీస్‌’తో పాటు ‘సిలికాన్‌ సిటీ’ వంటి చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా 2017లో వచ్చిన ‘సిలికాన్‌ సిటీ’లో శ్రీనగర్‌ కిట్టి, సూరజ్‌ గౌడ, కావ్య శెట్టి తదితరులతో కలిసి నటించింది. ఈ సినిమాతో ఆమెకు గుర్తింపు రావడంతోపాటు ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డు నామినేషన్లలోనూ పేరు కనిపించింది. ఆ తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉన్న ఏక్తా.. తనకు వచ్చిన పాత్రల్లో నటనకు ప్రాధాన్యం ఉండాలని భావిస్తోంది. కేవలం తెరపై కనిపించే పాత్రలకు పరిమితం కాకుండా, తన ప్రతిభను చూపించే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె గతంలో చెప్పింది. నటనలో మరింత మెరుగుపడేందుకు న్యూయార్క్‌లో మెథడ్‌ యాక్టింగ్‌ శిక్షణ కూడా తీసుకుంది.

తెలుగులో తొలి అవకాశం..

కన్నడలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత ఏక్తా రాథోడ్‌కు ‘లెగసీ’ రూపంలో టాలీవుడ్‌లో అవకాశం దక్కింది. రాజకీయాల నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. విశ్వక్‌సేన్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండటం, సీనియర్‌ నటీనటులు ఈ మూవీలో భాగం కావడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు కన్నడ కథానాయికలు తెలుగు తెరపైకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ జాబితాలోకి ఇప్పుడు ఏక్తా రాథోడ్‌ కూడా చేరుతోంది. తొలి సినిమానే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘లెగసీ’ కావడంతో.. తెలుగు ప్రేక్షకులు తనను ఎలా స్వీకరిస్తారన్నది ఆమె కెరీర్‌లో ఆసక్తికరమైన అంశంగా మారింది. కన్నడలో తెచ్చుకున్న అనుభవంతో టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేయాలని ఏక్తా భావిస్తోంది.

Advertisement
Advertisement