త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్‌ ఆసక్తికర పోస్ట్‌..!

Kayadu Lohar | హీరోయిన్‌ కయదు లోహర్‌ ప్రస్తుతం ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న‌ది. మరోవైపు విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న‌ది. ఈ క్రమంలో ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘మంజనత్తి’పై ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.

P

Entertainment | Published On Sep 9, 2026, 1.38 pm IST

Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్‌ ఆసక్తికర పోస్ట్‌..!
Advertisement

Kayadu Lohar | హీరోయిన్‌ కయదు లోహర్‌ ప్రస్తుతం ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న‌ది. మరోవైపు విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న‌ది. ఈ క్రమంలో ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘మంజనత్తి’పై ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నానంటూ ఆమె పేర్కొంది. ఎప్పుడూ ఎవరో ఒకరు తమను గమనిస్తూ, తమ ప్రవర్తనను ఓ కనిపించని ప్రమాణంతో కొలుస్తూ ఉంటే కలిగే ఒత్తిడి, బాధ కూడా ఒక రకమైన హింసేనని కయదు లోహర్‌ తన పోస్ట్‌లో అభిప్రాయ‌ప‌డింది.

ప్ర‌త్యేక అనుభ‌వం..

ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే సామాజిక అంచనాలు.. క్రమంగా వారిని నియంత్రించే సాధనాలుగా మారతాయని పేర్కొంది. విధేయతతో ఉంటే సురక్షితంగా ఉంటామనే భావన కలిగించడం ద్వారా కూడా అణచివేత కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. ‘అయితే అది ఎప్పటికీ భద్రతను ఇవ్వదు. ఒక నిబంధన తర్వాత మరో నిబంధ‌న‌, మరో చూపు, మరో హద్దులు ఎదురవుతూనే ఉంటాయి. చివరకు అడగకూడదనుకున్న ప్రశ్నను ఆమె అడిగిన రోజు.. ప్రపంచం తన అసలు రూపాన్ని చూపించడం మొదలవుతుంది’ అనే భావనను కయదు లోహర్‌ తన పోస్ట్‌లో వ్యక్తం చేసింది. సినిమా ద్వారా సమాజంలో లోతుగా పాతుకుపోయిన కొన్ని ఆలోచనలు, తీర్పులు, నియంత్రణ విధానాలను ప్రేక్షకులు ప్రశ్నించేలా చేయడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని క‌య‌దు పేర్కొంది.

ఆనందంలో..

ఇలాంటి కథలో భాగం కావడం గౌరవంగా ఉంద‌ని తెలిపింది. ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగం కావడం, దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు మరింత ఆనందాన్ని ఇస్తోంద‌ని చెప్పింది. మారి సెల్వరాజ్‌ తన సినిమాల్లో సామాజిక అంశాలను బలమైన కథనంతో తెరపై ఆవిష్కరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ‘మంజనత్తి’ కూడా ప్రేక్షకులను ఆలోచింపజేసే కథతో రూపొందుతోందా? అనే ఆసక్తి నెలకొంది. కయదు లోహర్‌ చేసిన ఈ పోస్ట్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ‘మంజనత్తి’తో తన జర్నీపై కయదు లోహర్‌ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు ఆమె పోస్ట్‌ ద్వారా స్పష్టమవుతోంది.

సినిమా లైన‌ప్‌..

ఇదిలా ఉండ‌గా.. క‌య‌దు న‌టించిన రెండు సినిమాలు ఇటీవ‌ల విడుద‌ల‌య్యాయి. ఐ యామ్ గేమ్‌, ఇమ్మోర్ట‌ల్ సినిమాల‌తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న ది ప్యారడైజ్ మూవీలో న‌టిస్తోంది. ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. అలాగే, మ‌ల‌యాళంలో థార‌మ్ మూవీ, త‌మిళంలో మంజ‌న‌త్తితో పాటు సూర్య 48లోనూ క‌నిపించ‌నుంది.

 

View this post on Instagram

 

A post shared by kayadulohar (@kayadu_lohar_official)

 

Advertisement
Advertisement