త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jawan Opens Fire | తోటి జ‌వాన్ల‌పై కాల్పులు.. న‌లుగురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి

Jawan Opens Fire | జ‌మ్ము క‌శ్మీర్ (Jammu And Kashmir) క‌థువా (Kathua) జిల్లాలోని ఓ జ‌వాను తోటి జ‌వాన్ల‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు (Jawan Opens Fire) జ‌రిపాడు. ఈ ఘటనలో ఒక అధికారి సహా నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Sep 30, 2026, 12.19 pm IST

Jawan Opens Fire | తోటి జ‌వాన్ల‌పై కాల్పులు.. న‌లుగురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి
Advertisement

Jawan Opens Fire | త్రినేత్ర న్యూస్ : జ‌మ్ము క‌శ్మీర్‌లో (Jammu And Kashmir) షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌థువా (Kathua) జిల్లాలోని ఓ జ‌వాను తోటి జ‌వాన్ల‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు (Jawan Opens Fire) జ‌రిపాడు. ఈ ఘటనలో ఒక అధికారి సహా నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బసోహ్లీలోని మష్కా గ్రామంలో ఉన్న సేవా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ వద్ద గల సీఐఎస్‌ఎఫ్‌ (Central Industrial Security Force) యూనిట్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

సీఐఎస్‌ఎఫ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. క్యాంప్‌లో స‌హ‌చ‌ర జ‌వాన్ల మ‌ధ్య నిన్న సాయంత్రం చిన్న‌పాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా మాటామాటా పెరిగి ర‌క్త‌పాతానికి దారి తీసింది. హెడ్ కానిస్టేబుల్ అవధేష్ కుమార్ సింగ్ ఒక్కసారిగా కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి త‌న ఏకే-47 (AK-47) రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అతని వద్ద 150 రౌండ్ల తూటాలు ఉన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు సిబ్బంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

తీవ్రంగా గాయ‌ప‌డిన సిబ్బందిని హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఎన్‌హెచ్‌పీసీ (NHPC) ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ వారు మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. మృతులు అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్-ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్స్‌ రఫీక్ అహ్మద్, సందీప్ కుమార్‌లుగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడు అవ‌ధేష్ కుమార్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని అత‌డి స‌ర్వీస్ గ‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

అరేబియా సముద్రంలో రూ.3వేల కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిన ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌.. ఐదుగురు పాక్ జాతీయులు అరెస్ట్‌

AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్‌

భారీ బ్యాట‌రీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బ‌డ్జెట్ ఫోన్‌.. ప్ర‌త్యేక ఏఐ కూడా..

Advertisement

తాజావార్తలు

Advertisement