Gold Price | ధన్‌తేరస్‌కు ముందే బంగారం ధరలకు బ్రేక్.. తులంపై రూ.700 డౌన్.. వెండి రూ.2వేలు..!
Gold Price | పండుగ సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్. ధన్‌తేరస్‌కు ముందే బులియన్ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు తులంపై రూ.700 తగ్గగా.. వెండి ధర కిలోపై ఏకంగా రూ.2వేలు పతనమైంది.
Gold Price | పండుగ సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్. ధన్‌తేరస్‌కు ముందే బులియన్ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు తులంపై రూ.700 తగ్గగా.. వెండి ధర కిలోపై ఏకంగా రూ.2వేలు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, ముడిచమురు ధరల పెరుగుదలతో పాటు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ధరలు దిగివస్తున్నాయి.
ఢిల్లీలో బంగారం, వెండి ధరలు ఎంతంటే?
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,800కు చేరింది. సోమవారం ముగింపు ధర రూ.1,42,500తో పోలిస్తే రూ.700 తగ్గింది. మరోవైపు, గత సెషన్‌లో స్థిరంగా ఉన్న వెండి ధరలు భారీగానే దిగివచ్చింది. కిలో వెండి ధర రూ.1,86,000 నుంచి రూ.1,84,000కు పడిపోయింది. అంటే ఒక్కరోజులోనే కిలో వెండిపై రూ.2వేల వరకు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ముడిచమురు ధరలు పుంజుకోవడం బంగారం ధరలపై ప్రభావం చూపాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. మరోవైపు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం, కూడా బులియన్ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. వరుసగా జరిగిన అమ్మకాలతో బంగారం, వెండి ధరలు ఓవర్‌సోల్డ్ స్థాయికి చేరువయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి వ్యవహరించడం కూడా మరో కారణం.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ అదే పరిస్థితి
దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 41.19 డాలర్లు (1.04 శాతం) తగ్గి 3,905.44 డాలర్లకు చేరింది. వెండి ధరలు సైతం 3 శాతానికి పైగా పతనమై ఔన్సుకు 48.97 డాలర్లకు దిగివచ్చింది. గ్లోబల్ మార్కెట్లలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి దేశీయ ధరలపైనా ప్రభావం చూపింది. ధరలు తగ్గుతున్నప్పటికీ రానున్న పండుగ సీజన్ బంగారం, వెండి మార్కెట్‌కు ఊతమివ్వవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధన్‌తేరస్, దీపావళి పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో ఈ పండుగలకు ముందు ఆభరణాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని సౌమిల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అయితే, ధరల్లో నిలకడైన రికవరీ రావాలంటే కొత్త కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయ పరిణామాలు అనుకూలంగా ఉండాలని జతిన్ త్రివేది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమెరికాలో ఎన్నికల ఫలితాలు, నిరుద్యోగ గణాంకాలు, నాన్‌ఫామ్ పేరోల్స్ వంటి కీలక ఆర్థిక పరిణామాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ఈ గణాంకాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంపై కొత్త సంకేతాలను ఇచ్చే అవకాశం ఉంది. వీటి ఆధారంగానే రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు ఆధారపడి ఉండనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nayanthara | మహాశక్తి రిలీజ్ వేళ నయనతార ప్రత్యేక పూజలు
- ●kollywood | తమిళనాడులో ఉదయం ఆరు గంటల నుంచే కొత్త సినిమాల స్క్రీనింగ్ - టికెట్ రేట్ల పెంపుకు "నో" పర్మిషన్
- ●Teenmar Mallanna | 2028లో మునుగోడు బీసీ ఎమ్మెల్యే పక్కా
- ●Rahul Gandhi | మోదీజీ.. చర్చకు రండి! భయమెందుకు..? మరోసారి ప్రధానికి రాహుల్ సవాల్
- ●Anil Ambani ED Action | 2 చార్టర్డ్ విమానాలు, 6 ప్లాట్లు జప్తు.. అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ పంజా: రూ.510 కోట్ల విలువైన ఆస్తులు సీజ్!
- ●Vemula Prashanth Reddy | మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది

Nayanthara | మహాశక్తి రిలీజ్ వేళ నయనతార ప్రత్యేక పూజలు

kollywood | తమిళనాడులో ఉదయం ఆరు గంటల నుంచే కొత్త సినిమాల స్క్రీనింగ్ - టికెట్ రేట్ల పెంపుకు "నో" పర్మిషన్

Teenmar Mallanna | 2028లో మునుగోడు బీసీ ఎమ్మెల్యే పక్కా

Rahul Gandhi | మోదీజీ.. చర్చకు రండి! భయమెందుకు..? మరోసారి ప్రధానికి రాహుల్ సవాల్





