Disha Salian | దిశా శాలియన్ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు
Disha Salians | దిశా సాలియన్ (Disha Salians) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియన్ (Satish Salian).. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray)కు రూ.500 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు.
Disha Salian | త్రినేత్ర.న్యూస్ : దివంగత బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియన్ (Satish Salian).. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray), ఎన్సీపీ (ఎస్పీ) నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు రూ.500 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు.
న్యాయం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ ప్రేరేపితమైనవిగా చిత్రీకరించేందుకు వారు ప్రయత్నించారని సతీష్ సాలియన్ తన నోటిసుల్లో ఆరోపించారు. కుమార్తెపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై చట్టపరమైన దర్యాప్తు కోరుతున్న తండ్రిని వారు న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. దిశా సాలియన్ కేసుపై సీబీఐ దర్యాప్తు చేసి తనకు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ ఆదిత్య ఠాక్రే తప్పుడు ప్రచారం చేశారని సతీశ్ సాలియన్ ఆరోపించారు.
క్షమాపణలకు డిమాండ్..
ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్‌ముఖ్‌లు తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా రాతపూర్వకమైన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్షమాపణను అన్ని టీవీల్లో, పేపర్లలో, డిజిటల్ మీడియా వేదికల్లో ప్రచురించాలని కోరారు. అంతేకాదు, కనీసం మూడు నిమిషాల వ్యవధిగల క్షమాపణ వీడియోని ఆ ఇద్దరు నేతలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే సివిల్ పరువు నష్టం కేసుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
దిశా శాలియన్ మృతి కేసు..
దిశా సాలియన్ 2020, జూన్ 8న మృతి చెందిన విషయం తెలిసిందే. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్ భవనం 14వ అంతస్తు నుంచి కిందపడి మరణించారు. ఆమె మరణానికి సంబంధించి అనేక అనుమానాలు, ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో పోలీసులు ప్రమాదవశాత్తు మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దిశది ఆత్మహత్యేనని తేల్చారు.
అయితే, తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ దిశ తండ్రి సతీష్ సాలియన్ (Satish Salian) ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సారంత్ కొత్వాల్, జస్టిస్ రంజిత్‌సిన్హా రాజా భోన్సెలెలతో కూడిన ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray), నటులు డినో మోరియా, రియా చక్రవర్తి (Rhea Chakraborty) పేర్లను చేర్చారు. హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read..
రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్ ఏమన్నదంటే..?
చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి
ఫెడ్ రేట్ పెంపుతోనూ లాభాల్లో భారత మార్కెట్లు.. నిఫ్టీ 23,300 పైన..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pop King | హైదరాబాద్‌లో పాప్‌కార్న్‌కు కొత్త క్రేజ్.. 17 రకాల రుచులతో అదరగొడుతున్న పాప్ కింగ్..
- ●MLA Ramachandru Naik | డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి తప్పిన ప్రమాదం
- ●Chiranjeevi | చిరంజీవి కాకాలో మరో హీరోయిన్ - ఫస్ట్ టైమ్ కోలీవుడ్ బ్యూటీతో మెగాస్టార్ రొమాన్స్
- ●Sangareddy | ఆరుగురు విద్యార్థులు మృతి.. హాస్టల్ వార్డెన్ అరెస్ట్
- ●Russia sanctions bill | రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్ ఏమన్నదంటే..?
- ●Telangana Assembly | అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్

Pop King | హైదరాబాద్‌లో పాప్‌కార్న్‌కు కొత్త క్రేజ్.. 17 రకాల రుచులతో అదరగొడుతున్న పాప్ కింగ్..

MLA Ramachandru Naik | డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి తప్పిన ప్రమాదం

Chiranjeevi | చిరంజీవి కాకాలో మరో హీరోయిన్ - ఫస్ట్ టైమ్ కోలీవుడ్ బ్యూటీతో మెగాస్టార్ రొమాన్స్

Sangareddy | ఆరుగురు విద్యార్థులు మృతి.. హాస్టల్ వార్డెన్ అరెస్ట్





