త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ASUS Vivobook | అసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఆక‌ట్టుకుంటున్న ఫీచ‌ర్లు.. ధ‌ర‌లు ఎంతంటే..?

ASUS Vivobook | కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ అసుస్ భార‌త్‌లో కొత్త‌గా ప‌లు వివోబుక్ ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసింది. యువ‌ర్ వైబ్‌, యువ‌ర్ క‌ల‌ర్ పేరుతో ఈ ఉత్ప‌త్తుల‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా వివోబుక్ ఎస్‌16, వివోబుక్ ఎస్‌14, వివోబుక్ 14 ఫ్లిప్‌, వివోబుక్ 16తోపాటు అసుస్ వైర్‌లెస్ సైలెంట్ మౌస్‌ను సైతం లాంచ్ చేసింది.

S

Technology | Published On Sep 17, 2026, 12.39 pm IST

ASUS Vivobook | అసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఆక‌ట్టుకుంటున్న ఫీచ‌ర్లు.. ధ‌ర‌లు ఎంతంటే..?
Advertisement

ASUS Vivobook | కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ అసుస్ భార‌త్‌లో కొత్త‌గా ప‌లు వివోబుక్ ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసింది. యువ‌ర్ వైబ్‌, యువ‌ర్ క‌ల‌ర్ పేరుతో ఈ ఉత్ప‌త్తుల‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా వివోబుక్ ఎస్‌16, వివోబుక్ ఎస్‌14, వివోబుక్ 14 ఫ్లిప్‌, వివోబుక్ 16తోపాటు అసుస్ వైర్‌లెస్ సైలెంట్ మౌస్‌ను సైతం లాంచ్ చేసింది. అసుస్ వివోబుక్ ఎస్‌14, ఎస్16 ల్యాప్‌టాప్‌ల‌ను మిలిట‌రీ గ్రేడ్ మ‌న్నిక‌తో త‌యారు చేశారు. అందువ‌ల్ల వీటి బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. అలాగే తేలిక‌పాటి మెట‌ల్ డిజైన్‌ను క‌లిగి ఉన్నందున వీటిని ప్ర‌యాణాల్లో తీసుకెళ్ల‌డం కూడా చాలా సుల‌భంగా ఉంటుంది. వివోబుక్ ఎస్‌14 గ‌రిష్టంగా 20 గంట‌ల వ‌ర‌కు, వివోబుక్ ఎస్‌16 గ‌రిష్టంగా 15 గంట‌ల‌కు పైగా బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను అందిస్తాయ‌ని కంపెనీ తెలిపింది.

ఏఐ కోసం ప్ర‌త్యేక ఫీచ‌ర్లు..

ఈ రెండు ల్యాప్‌టాప్‌ల‌లోనూ ఏఐ కోసం ప్ర‌త్యేక‌మైన ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. ఇవి 17 టాప్స్ సామ‌ర్థ్యంతో ప‌నిచేస్తాయి. దీనివ‌ల్ల ఏఐ ఆధారిత ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయ‌వ‌చ్చు. ఇంటెల్ కోర్ 7 సిరీస్ 3 ప్రాసెస‌ర్‌, ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ 2024, 100జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌, మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ వంటి ఫీచ‌ర్ల‌ను వీటిల్లో అందించారు.

38 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌..

వివోబుక్ 14 ఫ్లిప్, ఎస్14 ఫ్లిప్ ల‌లో 360 డిగ్రీల ఆల్ మెట‌ల్ డిజైన్ ఉంది. ఇవి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌, ఓలెడ్ టచ్ స్క్రీన్‌, స్టైల‌స్ స‌పోర్ట్ వంటి ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉన్నాయి. విద్య‌, ఉద్యోగం, వ్యాపారం, క్రియేటివిటీ, కంటెంట్ వీక్షించ‌డం ఇలా ఏ పనైనా స‌రే ఇవి అనుకూలంగా ఉంటాయి. అందుకు గాను ప‌లు ర‌కాల మోడ్‌ల‌ను అందించారు. వివోబుక్ 14 ఫ్లిప్ 38 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను అందిస్తుంద‌ని కంపెనీ తెలిపింది. 49 టాప్స్ ఎన్‌పీయూ కెపాసిటీ ఉంద‌ని, ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ 3 ప్రాసెస‌ర్‌, వెబ్‌క్యామ్ షీల్డ్ ఏఐ కెమెరా, థండ‌ర్ బోల్ట్ 4, మైక్రో ఎస్‌డీ కార్డు రీడ‌ర్ వంటి ఫీచ‌ర్ల‌ను ఇచ్చామ‌ని కంపెనీ తెలిపింది. వివోబుక్ ఎస్14 ఫ్లిప్ 30 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. ఇందులో 45 టాప్స్ ఎన్‌పీయూ సామర్థ్యంతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్, ఏఐ ఎఫ్‌హెచ్‌డీ ఐఆర్ కెమెరా, యూఎస్‌బీ 3.2 జనరేషన్ 2 టైప్ సి పోర్టులు ఉన్నాయి.

45 టాప్స్ ఎన్‌పీయూ..

అసుస్ వివోబుక్ 16ను సన్నని, తేలికపాటి మిలిటరీ గ్రేడ్ డిజైన్‌తో రూపొందించారు. ఇందులో ఏఎండీ రైజెన్ 7 ప్రాసెసర్, 10 టాప్స్ సామర్థ్యంతో అసేస్ ఏఐ పీసీ సదుపాయం ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లో ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఎఫ్‌హెచ్‌డీ ఏఐ కెమెరా, ఇంటెలిజెంట్ ఫేషియల్ రికగ్నిషన్, ప్రైవసీ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏడాది పాటు 100జీబీ క్లౌడ్ స్టోరేజ్‌తో మైక్రోసాఫ్ట్ ఉత్పాదకత టూల్స్ కూడా లభిస్తాయి. అసుస్ వివోబుక్ ఎస్14, వివోబుక్ ఎస్16 కూడా ఆల్ మెటల్, తేలికపాటి డిజైన్‌తో వస్తాయి. ఇవి మిలిట‌రీ గ్రేడ్ మ‌న్నిక‌, టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్, 30 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. రెండు మోడళ్లలోనూ 45 టాప్స్ ఎన్‌పీయూ సామర్థ్యంతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ ఉంటుంది. వివోబుక్ ఎస్16లో ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ వరకు అసుస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండగా, వివోబుక్ ఎస్14లో ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంటుంది. రెండు మోడళ్లలో రెండు యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, హెచ్‌డీఎంఐ 2.1, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ 2024, మైక్రోసాఫ్ట్ 365 బేసిక్, ఏడాది పాటు 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫీచ‌ర్లు ఉన్నాయి.

వైర్‌లెస్ మౌస్ సైతం..

ల్యాప్‌టాప్‌లతోపాటు అసుస్ వైర్‌లెస్ సైలెంట్ మౌస్ ఎండబ్ల్యూ103ను కూడా విడుదల చేసింది. ఇది గ్రీన్, పింక్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. అంబిడెక్స్ట్రస్ డిజైన్‌తో రూపొందించిన ఈ మౌస్‌లో సైలెంట్ క్లిక్ స్విచ్‌లు, 1000, 1200, 1600 డీపీఐలను ఎంచుకునే సదుపాయం ఉన్నాయి. 2.4 గిగాహెడ్జ్‌ వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం ప్లగ్ అండ్ ప్లే ఆర్ఎఫ్ డాంగిల్‌ను ఉపయోగిస్తుంది. అదనపు డ్రైవర్లు లేదా సాఫ్ట్‌వేర్ అవసరం లేదు. మౌస్ బ్లాక్ రంగులో ఉంటుంది. ఆప్టికల్ ట్రాకింగ్ స‌దుపాయం ఉంది. ఇది విండోస్ 11, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప‌నిచేస్తుంది.

ధరలు, లభ్యత..

అసుస్ వివోబుక్ ఎస్14, వివోబుక్ ఎస్16, వివోబుక్ 14 ఫ్లిప్, వివోబుక్ ఎస్14 ఫ్లిప్, వివోబుక్ 16, వైర్‌లెస్ సైలెంట్ మౌస్ ఎండబ్ల్యూ103 గురువారం నుంచే అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అసుస్ ఈ-షాప్, రిటైల్ భాగస్వాములు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, అధీకృత అసుస్ రిటైలర్ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. వివోబుక్ ఎస్14 ధర రూ.1,18,990 ఉండ‌గా, వివోబుక్ ఎస్16 ధర రూ.1,21,990గా ఉంది. వివోబుక్ 14 ఫ్లిప్ ధర రూ.1,79,990 కాగా, వివోబుక్ ఎస్14 ఫ్లిప్ ధర రూ.1,09,990గా ఉంది. వివోబుక్ 16 ధర రూ.89,990గా ఉంది. వైర్‌లెస్ సైలెంట్ మౌస్ ఎండబ్ల్యూ103 ధర రూ.649గా ఉంది. స్నాప్‌డ్రాగన్ ఆధారిత వివోబుక్ ఎస్14 అక్టోబర్ రెండో వారం నుంచి, వివోబుక్ ఎస్16 అక్టోబర్ చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలను అక్టోబర్ చివరి నాటికి ప్రకటించనున్నట్లు అసుస్ తెలిపింది.

ఆఫ‌ర్లు..

అర్హత కలిగిన మోడళ్లు, ప్లాట్‌ఫామ్‌లు, నిబంధనలకు అనుగుణంగా అసుస్ ఈజీ పే ఫైనాన్సింగ్‌లో నో-కాస్ట్ ఈఎంఐ, లో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. పరిమిత కాల లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.5,599 విలువైన రెండు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ, మూడు సంవత్సరాల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కేవలం రూ.99కే అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Advertisement
Advertisement