kollywood | తమిళనాడులో ఉదయం ఆరు గంటల నుంచే కొత్త సినిమాల స్క్రీనింగ్ – టికెట్ రేట్ల పెంపుకు “నో” పర్మిషన్
కోలీవుడ్‌కు విజయ్ టీవీకే ప్రభుత్వం గుడ్‌న్యూస్ వినిపించింది. ఇక నుంచి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేకుండా కొత్త సినిమాలు రిలీజైన రోజు నుంచి వారం వరకు ఆరు షోలను ప్రదర్శించుకోవచ్చని ప్రకటించింది. ఉదయం ఆరు గంటల నుంచే సినిమాలను స్క్రీనింగ్ చేసుకోవచ్చని చెప్పింది.
Entertainment | Published On Nov 3, 2026, 8.38 pm IST
kollywood | తమిళ సినీ పరిశ్రమకు దళపతి విజయ్ టీవీకే ప్రభుత్వం గుడ్‌న్యూస్ వినిపించింది. తమిళనాడులో కొత్త సినిమాలను ఉదయం ఆరు గంటల నుంచే స్క్రీనింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. స్పెషల్ ప్రీమియర్లతో పాటు రోజుకు ఆరు షోలను ప్రదర్శించేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక జీవోను మంగళవారం రిలీజ్ చేశారు.
రిలీజ్ టైమ్‌లో..
గతంలో తమిళనాడులో భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ టైమ్‌లో స్పెషల్ షోస్ కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సివచ్చేంది. ఆ నిబంధనను టీవీకే ప్రభుత్వం ఎత్తేసింది. ఎలాంటి పర్మిషన్లు అవసరం లేకుండా కొత్త సినిమా విడుదలైనప్పటి నుంచి వారం రోజుల వరకు ప్రతి రోజు ఆరు షోలను ప్రదర్శించే అవకాశం కల్పించింది. ఉదయం ఆరు గంటల నుంచే సినిమా స్క్రీనింగ్ మొదలుపెట్టుకోవచ్చునని ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి అనుమతులు అవసరం లేదని ఈ జీవోలో పేర్కొన్నారు. వీకెండ్స్‌తో పాటు పండుగల టైమ్‌లో కూడా ఆరు షోల నిబంధన వర్తిస్తుందని చెప్పారు.
టికెట్ ధరలకు నో...
సినిమా టికెట్ రేట్ల పెంపుకు మాత్రం విజయ్ ప్రభుత్వం నో చెప్పింది. సినిమా టికెట్ ధరలను పెంచాలని కోలీవుడ్ వర్గాలు విజయ్ ప్రభుత్వాన్ని కోరాయి. స్పెషల్ ప్రీమియర్లకు పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం టికెట్ రేట్ల గురించి మాత్రం ఇందులో ప్రస్తావించకపోవడం గమనార్హం.
దీపావళి సినిమాలకు బెనిఫిట్
స్పెషల్ ప్రీమియర్లకు అనుమతులు లభించడం దీపావళి సినిమాలకు బెనిఫిట్ కాబోతుంది. ఈ పండుగకు సూర్య సీన్, నయనతార మూక్కుత్తి అమ్మన్‌తో పాటు రణబీర్‌కపూర్, సాయిపల్లవి రామాయణ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆరు షోల కారణంగా ఈ సినిమాలు భారీగా ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | రజనీకాంత్ సినిమాలో శ్రీలీల – కన్ఫామ్ చేసిన కమల్ హాసన్
నవంబర్ 3, 2026

Sreeleela | రూమర్లకు చెక్ పెట్టిన శ్రీలీల – సెట్స్‌పైకి తమిళ మూవీ – నిర్మాతగా కోలీవుడ్ స్టార్ హీరో భార్య
నవంబర్ 2, 2026

Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ – టాలీవుడ్ హీరోలతో పోటీ…
నవంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Teenmar Mallanna | 2028లో మునుగోడు బీసీ ఎమ్మెల్యే పక్కా
- ●Rahul Gandhi | మోదీజీ.. చర్చకు రండి! భయమెందుకు..? మరోసారి ప్రధానికి రాహుల్ సవాల్
- ●Anil Ambani ED Action | 2 చార్టర్డ్ విమానాలు, 6 ప్లాట్లు జప్తు.. అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ పంజా: రూ.510 కోట్ల విలువైన ఆస్తులు సీజ్!
- ●Vemula Prashanth Reddy | మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది
- ●TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం
- ●Revanth Reddy Viral Video | ఒకవైపు ట్రోల్స్.. మరోవైపు సపోర్ట్: రేవంత్ రెడ్డి వీడియోపై తీవ్ర దుమారం!

Teenmar Mallanna | 2028లో మునుగోడు బీసీ ఎమ్మెల్యే పక్కా

Rahul Gandhi | మోదీజీ.. చర్చకు రండి! భయమెందుకు..? మరోసారి ప్రధానికి రాహుల్ సవాల్

Anil Ambani ED Action | 2 చార్టర్డ్ విమానాలు, 6 ప్లాట్లు జప్తు.. అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ పంజా: రూ.510 కోట్ల విలువైన ఆస్తులు సీజ్!

Vemula Prashanth Reddy | మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది



