Tapt Kund | బద్రీనాథ్‌లో విషాదం.. తప్త్ కుండ్‌లో స్నానమాచరిస్తూ అక్కాచెల్లెళ్లు మృతి
Tapt Kund | ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామ్‌లోని తప్త్ కుండ్ (Tapt Kund)లో మునిగి ఇద్దరు మహిళా భక్తులు (Pilgrims) ప్రాణాలు కోల్పోయారు. మృతులు రాజస్థాన్‌లోని భిల్వారా (Bhilwara)కు చెందిన అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు.
Tapt Kund | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామ్ (Badrinath Dham)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తప్త్ కుండ్ (వేడినీటి కుండ్)లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఇద్దరు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు రాజస్థాన్ (Rajasthan)లోని భిల్వారా (Bhilwara)కు చెందిన అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు.
రాజస్థాన్‌కు చెందిన 100 మందికిపైగా భక్తుల బృందం సెప్టెంబర్ 4న బద్రీనాథ్ వెళ్లింది. అక్కడ ధార్మిక ప్రవచనాలను నిర్వహిస్తోంది. ఈ బృందంలోని నలుగురు మహిళా భక్తులు రాము దేవి (71), ప్రేమ్ దేవి (73), భగవతి దేవి, సోహ్ని దేవి శుక్రవారం ఉదయం మొక్కులు చెల్లించుకునేందుకు బద్రీనాథ్ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అలకనంద నది ఒడ్డున ఉన్న పవిత్ర తప్త్ కుండ్ (Tapt Kund)లో 108 సార్లు మునిగి స్నానం చేసేందుకు వెళ్లారు. నలుగురూ ఎంతో భక్తి శ్రద్ధలతో వేడి నీటిలో మునుగుతున్నారు. 50 మునకల తర్వాత రాము దేవి, ప్రేమ్ దేవి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
అక్కడే ఉన్న స్థానికులు గమనించి వారిని కుండ్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. వీరి మృతితో అక్కడ విషాధ ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. హరిద్వార్‌లో అంత్యక్రియలు నిర్వహించాలని కోరడంతో.. ఎస్డీఎం ఆదేశాల మేరకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
తప్త్ కుండ్.. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అలకనంద నది ఒడ్డున ఉన్న ఒక సహజమైన వేడి నీటి బుగ్గ. హిమాలయ ప్రాంతంలో గడ్డకట్టే వాతావరణం ఉన్నప్పటికీ ఈ కుండ్‌లోని నీళ్లు ఎప్పుడూ 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడిగా ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం.. ఈ కుండ్ అగ్ని దేవుని నివాస స్థలంగా భావిస్తారు. అగ్నిదేవుడు ఇక్కడ ఘోర తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాడని, ఆయన ఇచ్చిన వరంతోనే ఈ నీరు ఎల్లప్పుడూ వేడిగా ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, ఈ కుండ్‌లో స్నానమాచరిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, ఆత్మశుద్ధ జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు బద్రీనాథుడిని దర్శించుకునే ముందు తప్పకుండా ఈ కుండ్‌లో ఒక్కసారైనా మునుగుతారు.
Also Read..
కాళీమాత ఆలయంలో చేపల కూర తిన్న బెంగాల్ సీఎం
సభలో మాట్లాడలేకే బీఆర్‌ఎస్ నేతల డైవర్షన్ పాలిటిక్స్: ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Allu Arjun | అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ మూవీ కేరళలో లాంఛ్? - ఫ్యామిలీ మ్యాన్‌గా బన్నీ
- ●Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్ హస్తం ఉంది
- ●Vinesh Phogat | వినేశ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ.. ట్రయల్స్‌కు హైకోర్టు నో!
- ●Suvendu Adhikari | కాళీమాత ఆలయంలో చేపల కూర తిన్న బెంగాల్ సీఎం
- ●ప్రపంచాన్ని మార్చేసిన భయానక ఉదయం: 9/11 దాడులకు 25 ఏళ్లు.. వెనుక ఉన్న భయంకర వ్యూహం
- ●Samyuktha | మలయాళ బ్యూటీతో రామ్ రొమాన్స్ - తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసిన సంయుక్త

Allu Arjun | అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ మూవీ కేరళలో లాంఛ్? - ఫ్యామిలీ మ్యాన్‌గా బన్నీ

Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్ హస్తం ఉంది

Vinesh Phogat | వినేశ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ.. ట్రయల్స్‌కు హైకోర్టు నో!

Suvendu Adhikari | కాళీమాత ఆలయంలో చేపల కూర తిన్న బెంగాల్ సీఎం






