Drugs | హైదరాబాద్‌లో రూ.12.65 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్
Drugs | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ నిరోధానికి ఈగల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఏదో ఒకచోట నగరంలో డ్రగ్స్ దొరికిపోతున్నాయి. తాగాజా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను గుట్టురట్టు చేశారు ఈగల్ పోలీసులు.
మియాపూర్, సైఫాబాద్ పోలీసు స్టేషన్లలో డ్రగ్స్‌కు సంబంధించి 2 కేసులు నమోదు కాగా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.12.65 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాల్లో రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన క్యారియర్లు, డెలివరీ ఏజెంట్లు, మధ్యవర్తులను గుర్తించారు. ముఠా ఇప్పటివరకు 78 సార్లు డ్రగ్స్ తెప్పించినట్లు వెల్లడైంది.
ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన మహేందర్ మావత్‌ను కీలక సరఫరాదారుగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మియాపూర్ కేసులో మధురామ్, మహేంద్ర పటేల్, ధర్మేంద్రను అరెస్టు చేయగా.. సైఫాబాద్ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉండి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్లకు సీఎం హామీ ఇచ్చారు.. ఇక ఏ ప్రాజెక్టూ ఆగొద్దు
- ●Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!
- ●Deepfakes | అల్గారిథమ్‌ను మార్చండి.. డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
- ●Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..
- ●Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాలకు విజయ్ దేవరకొండ.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు
- ●Varanasi Story | రాజమౌళి వారణాసి కథ లీక్ - రుద్ర, మందాకిని సీక్రెట్ మిషన్ - రామాయణంతో లింక్

Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్లకు సీఎం హామీ ఇచ్చారు.. ఇక ఏ ప్రాజెక్టూ ఆగొద్దు

Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!

Deepfakes | అల్గారిథమ్‌ను మార్చండి.. డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు

Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..






