త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Assembly | సభలో మాట్లాడలేకే బీఆర్‌ఎస్‌ నేతల డైవర్షన్‌ పాలిటిక్స్‌: ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌

TG Assembly | సభలో మాట్లాడలేకే బీఆర్‌ఎస్‌ నేతలు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బల్మూర్‌ వెంకట్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి దందా బయటపడుతుందని భయపడుతున్నారని ఆరోపించారు.

P

Telangana | Published On Sep 11, 2026, 2.10 pm IST

TG Assembly | సభలో మాట్లాడలేకే బీఆర్‌ఎస్‌ నేతల డైవర్షన్‌ పాలిటిక్స్‌: ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌
Advertisement

TG Assembly | సభలో మాట్లాడలేకే బీఆర్‌ఎస్‌ నేతలు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బల్మూర్‌ వెంకట్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి దందా బయటపడుతుందని భయపడుతున్నారని ఆరోపించారు. శుక్ర‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద విలేక‌రుల‌తో ఆయ‌న మాట్లాడారు. తెలంగాణలో వేల ఎకరాల భూములను చ‌ర‌బ‌ట్టిన చ‌రిత్ర బీఆర్ఎస్ నేత‌ల‌ది కాదా అని ప్ర‌శ్నించారు. 22పై కూడా ప్రభుత్వమే చర్చకు సిద్ధంగా ఉందని చెప్పినా ఆరోపణలు చేయడం వాళ్ల అవివేకమన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ములేకనే తప్పించుకునే ప్రయత్నం చేశారని బల్మూర్‌ వెంకట్‌ విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలకులు ధరణి పేరుతో నిషేధిత జాబితాలో పెట్టిన భూమ్ములకంటే... ఇప్పుడు 22ఏలో పెట్టిన భూములు తక్కువేనని పేర్కొన్నారు. అసలు విషయాలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే, పోలీసుల మీద ఫైటింగ్‌లు, సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేశారని అన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని బల్మూర్‌ వెంకట్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement