Samyuktha | మలయాళ బ్యూటీతో రామ్ రొమాన్స్ – తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసిన సంయుక్త
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. హీరో రామ్ పోతినేనితో జోడీకట్టబోతుంది. రామ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త ఖరారైంది.
Entertainment | Published On Sep 11, 2026, 2.45 pm IST
Samyuktha | మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగులో మరో క్రేజీ ఛాన్స్ అందుకుంది. రామ్ పోతినేనితో రొమాన్స్ చేయబోతుంది. టాలీవుడ్‌లో మంచి బ్లాక్‌బస్టర్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టాడు. తానే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. ఈ సినిమాకు రామ్ తమ్ముడు కృష్ణ పోతినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో వీర అనే పాత్రలో రామ్ కనిపించబోతున్నాడు. రగ్గ్‌డ్ లుక్‌లో ఫుల్ మాస్ యాంగిల్‌లో అతడి పాత్ర సాగుతుందని సమాచారం.
పోస్టర్ రిలీజ్...
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ కన్ఫామ్ అయ్యింది. రామ్ సరసన సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్ని గురువారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంయుక్త మీనన్ బర్త్‌డే సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సింపుల్ లుక్‌లో సంయుక్త కనిపించింది. ఆమె వెనుక వీ అనే అక్షరం ఉండటం ఆసక్తిని పంచుతోంది.
రామ్ డైరెక్షనల్ డెబ్యూ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మరో మూడు సినిమాలు...
ప్రస్తుతం తెలుగులో ఐదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది సంయుక్త మీనన్. రామ్ మూవీతో పాటు బ్లాక్‌గోల్డ్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది. ఇదే కాకుండా నిఖిల్ స్వయంభూ, పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోల్‌లో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలన్ని ఈ ఏడాదే థియేటర్లలోకి రాబోతున్నాయి.
తాజావార్తలు
- ●Suvendu Adhikari | కాళీమాత ఆలయంలో చేపల కూర తిన్న బెంగాల్ సీఎం
- ●ప్రపంచాన్ని మార్చేసిన భయానక ఉదయం: 9/11 దాడులకు 25 ఏళ్లు.. వెనుక ఉన్న భయంకర వ్యూహం
- ●UPI Tap and Pay | ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు.. ఆర్బీఐ కొత్త ఫీచర్ ఇదే..
- ●Omar Abdullah | కశ్మీరీలు జైల్లో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా..? : వందేమాతరం ఆలాపనపై మిత్రపక్షాన్ని ప్రశ్నించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
- ●TG Assembly | సభలో మాట్లాడలేకే బీఆర్ఎస్ నేతల డైవర్షన్ పాలిటిక్స్: ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
- ●Vakiti Srihari | గోపాలమిత్రల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నం

Suvendu Adhikari | కాళీమాత ఆలయంలో చేపల కూర తిన్న బెంగాల్ సీఎం

ప్రపంచాన్ని మార్చేసిన భయానక ఉదయం: 9/11 దాడులకు 25 ఏళ్లు.. వెనుక ఉన్న భయంకర వ్యూహం

UPI Tap and Pay | ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు.. ఆర్బీఐ కొత్త ఫీచర్ ఇదే..

Omar Abdullah | కశ్మీరీలు జైల్లో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా..? : వందేమాతరం ఆలాపనపై మిత్రపక్షాన్ని ప్రశ్నించిన సీఎం ఒమర్ అబ్దుల్లా






