Allu Arjun | అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ మూవీ కేరళలో లాంఛ్? – ఫ్యామిలీ మ్యాన్‌గా బన్నీ
అల్లు అర్జున్, మలయాళ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ఈ పాన్ ఇండియన్ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. దాదాపు ఆరేళ్ల తర్వాత స్వీయ నిర్మాణ సంస్థలో బన్నీ సినిమా చేయబోతుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ కేరళలోనే జరుగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Sep 11, 2026, 3.30 pm IST
Allu Arjun | రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ మలయాళ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న రాకా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది. రాకా తర్వాత లోకేష్ కనగరాజ్‌తో ఓ సూపర్ హీరో సినిమా అంగీకరించాడు బన్నీ. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఫ్యామిలీ మ్యాన్...
తాజాగా బన్నీ, మలయాళ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కాంబోలో ఓ సినిమా ఫిక్సైనట్లు సమాచారం. చాలా కాలంగా ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. యూనివర్సల్ పాయింట్‌తో బాసిల్ జోసెఫ్ సిద్ధం చేసిన కథ బన్నీగా బాగా నచ్చినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రధానంగా డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా మాస్, యాక్షన్ ప్రధాన పాత్రల్లోనే కనిపిస్తున్న అల్లు అర్జున్...బాసిల్ జోసెఫ్ సినిమాలో మాత్రం ఫ్యామిలీ మ్యాన్‌గా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో...
బన్నీ, బాసిల్ జోసెఫ్ సినిమాకు నిర్మాతలు కూడా దొరికారు. స్వీయ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే అల్లు అర్జున్ ఈ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్‌లో చివరగా అలా వైకుంఠపురములో సినిమా చేశాడు బన్నీ. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ హోమ్ బ్యానర్‌లో సినిమాను అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.
మలయాళంలో...
తెలుగుతో పాటు మలయాళంలో ఒకే సారి ఈ సినిమాను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. బన్నీకి మలయాళంలో భారీగా క్రేజ్ ఉంది. అది దృష్టిలో పెట్టుకొని సినిమా లాంఛింగ్ ఈవెంట్‌ను కూడా కేరళలోనే గ్రాండ్‌గా నిర్వహించేందుకు గీతా ఆర్ట్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు పలువురు మలయాళ టాప్ స్టార్స్ అటెండ్ కానున్నట్లు చెబుతున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరుగనున్నట్లు సమాచారం. కేరళలో ఓపెనింగ్ ఈవెంట్‌ను జరుపుకోనున్న తొలి తెలుగు సినిమాగా బన్నీ, బాసిల్ జోసెఫ్ మూవీ నిలవనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Tapt Kund | బద్రీనాథ్‌లో విషాదం.. తప్త్ కుండ్‌లో స్నానమాచరిస్తూ అక్కాచెల్లెళ్లు మృతి
- ●Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్ హస్తం ఉంది
- ●Vinesh Phogat | వినేశ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ.. ట్రయల్స్‌కు హైకోర్టు నో!
- ●Suvendu Adhikari | కాళీమాత ఆలయంలో చేపల కూర తిన్న బెంగాల్ సీఎం
- ●ప్రపంచాన్ని మార్చేసిన భయానక ఉదయం: 9/11 దాడులకు 25 ఏళ్లు.. వెనుక ఉన్న భయంకర వ్యూహం
- ●Samyuktha | మలయాళ బ్యూటీతో రామ్ రొమాన్స్ - తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసిన సంయుక్త

Tapt Kund | బద్రీనాథ్‌లో విషాదం.. తప్త్ కుండ్‌లో స్నానమాచరిస్తూ అక్కాచెల్లెళ్లు మృతి

Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్ హస్తం ఉంది

Vinesh Phogat | వినేశ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ.. ట్రయల్స్‌కు హైకోర్టు నో!

Suvendu Adhikari | కాళీమాత ఆలయంలో చేపల కూర తిన్న బెంగాల్ సీఎం



