త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Omar Abdullah | క‌శ్మీరీలు జైల్లో ఉండాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోందా..? : వందేమాత‌రం ఆలాప‌న‌పై మిత్ర‌ప‌క్షాన్ని ప్ర‌శ్నించిన సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా

Omar Abdullah | వందేమాత‌రం వివాదంపై కాంగ్రెస్ పార్టీకి జ‌మ్ము క‌శ్మీర్ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా (CM Omar Abdullah) గ‌ట్టిగా బ‌దులిచ్చారు. క‌శ్మీరీలు (Kashmiris) జైల్లో ఉండాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోందా..? అంటూ నిల‌దీశారు. ఒక పార్టీగా వందేమాత‌రాన్ని ఎప్పుడూ అధికారికంగా స్వీక‌రించ‌క‌పోయినా.. నిబంధ‌న‌ల‌ను మాత్రం పాటించాల్సిందేన‌ని తేల్చి చెప్పారు.

D

National | Published On Sep 11, 2026, 2.11 pm IST

Omar Abdullah | క‌శ్మీరీలు జైల్లో ఉండాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోందా..? : వందేమాత‌రం ఆలాప‌న‌పై మిత్ర‌ప‌క్షాన్ని ప్ర‌శ్నించిన సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా
Advertisement

Omar Abdullah | త్రినేత్ర‌.న్యూస్ : వందేమాతరం (Vande Mataram) పూర్తి గేయం ఆలాపనపై కాంగ్రెస్ (Congress), నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) మధ్య వివాదం మరింత ముదురుతోంది. శ్రీ‌న‌గ‌ర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో వందేమాత‌రం పూర్తి గేయాన్ని ఆల‌పించ‌డంపై కాంగ్రెస్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై జ‌మ్ము క‌శ్మీర్ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా (CM Omar Abdullah) తీవ్రంగా స్పందించారు. క‌శ్మీరీలు (Kashmiris) జైల్లో ఉండాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోందా..? అంటూ ప్ర‌శ్నించారు.

దేశవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం అన్ని చరణాలను పూర్తిగా ఆలపించాలని చట్టం, నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని ఒమ‌ర్ అబ్దుల్లా తెలిపారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో క‌శ్మీరీలు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ఎదుర్కోవాల‌ని, జైల్లో ఉండాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోందా..? అని మిత్ర‌ప‌క్షాన్ని నిల‌దీశారు. ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ముగింపు వేడుక‌ల్లో కూడా జాతీయ గీతంతోపాటూ జాతీయ గేతం వందేమాత‌రాన్ని పూర్తిగా ఆల‌పిస్తామ‌ని ఒమ‌ర్ అబ్దుల్లా ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ఒక పార్టీగా వందేమాత‌రాన్ని ఎప్పుడూ అధికారికంగా స్వీక‌రించ‌క‌పోయినా.. నిబంధ‌న‌ల‌ను మాత్రం పాటించాల్సిందేన‌ని తేల్చి చెప్పారు.

ఇదీ వివాదం..

కాగా, శ్రీ‌న‌గ‌ర్‌లో (Srinagar) జ‌రిగిన జమ్ము కశ్మీర్ తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా (CM Omar Abdullah), నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ (National Conference) అధ్య‌క్షుడు ఫ‌రూక్ అబ్దుల్లా (Farooq Abdullah) స‌మ‌క్షంలో జాతీయ గేయం వందేమాత‌రం (Vande Mataram)లోని పూర్తి ఆరు చ‌ర‌ణాల‌ను ఆల‌పించారు. ఆ స‌మ‌యంలో సీఎం, ఫ‌రూక్ అబ్దుల్లా ఇద్ద‌రూ గేయం పూర్త‌య్యే వ‌ర‌కూ నిల‌బ‌డే ఉండ‌టం వివాదానికి దారి తీసింది. త‌న మిత్ర‌ప‌క్ష‌మైన‌ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ తీరుపై హ‌స్తం (Congress) పార్టీ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... దేశ స్వాతంత్య్ర సమరయోధుల భావజాలాన్ని గౌరవించాలని, లౌకిక, సమగ్ర స్ఫూర్తిని కాపాడాలని తన మిత్రపక్షాన్ని కోరారు. అంతేకాదు, 1937 నాటి కాంగ్రెస్ తీర్మానం ప్రకారం వందేమాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని సూచించారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల నిర్ణ‌యాన్ని మిత్ర‌ప‌క్షాలు గౌర‌వించాల‌ని హిత‌వు ప‌లికారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యంత‌రాల‌పై నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ కూడా అదే స్థాయిలో స్పందించింది. మిత్రపక్షాల కార్యక్రమాల్లో ఏ వెర్షన్ పాడాలనే దానిపై కాంగ్రెస్ తమకు షరతులు విధించలేదని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ నిబంధనలకు అనుగుణంగానే గేయాన్ని గౌరవించామని వెల్ల‌డించింది. ఈ వివాదంపై ఇప్పుడు సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా సైతం కాంగ్రెస్‌కు గ‌ట్టిగా బ‌దులిచ్చారు.

Also Read..

మ‌హారాష్ట్ర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 14 మంది మృతి

పండుగ‌ల వేళ ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్‌న్యూస్‌.. ఈ రూట్‌లో భారీగా ప్ర‌త్యేక రైళ్లు..!

ఇరుముడి స‌క్సెస్ మీట్‌లో కింద‌ప‌డిపోయిన‌ హీరోయిన్ - వీడియో వైర‌ల్‌

Advertisement
Advertisement