త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suvendu Adhikari | కాళీమాత ఆల‌యంలో చేప‌ల కూర‌ తిన్న బెంగాల్ సీఎం

Suvendu Adhikari | కోల్‌క‌తాలోని కాళీమాత ఆల‌యాన్ని బెంగాల్ సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ చేపలు, బ‌సంతి పులావ్‌తో కూడిన సంప్ర‌దాయ నైవేద్యాన్ని స్వీక‌రించారు.

D

National | Published On Sep 11, 2026, 3.11 pm IST

Suvendu Adhikari | కాళీమాత ఆల‌యంలో చేప‌ల కూర‌ తిన్న బెంగాల్ సీఎం
Advertisement

Suvendu Adhikari | త్రినేత్ర‌.న్యూస్ : కౌశికి అమావాస్య (Kaushiki Amavasya) సంద‌ర్భంగా కోల్‌క‌తా కాళీఘాట్ (Kalighat)లోని కాళీమాత అమ్మ‌వారి ఆల‌యాన్ని బెంగాల్ ముఖ్య‌మంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) సంద‌ర్శించారు. గురువారం ఆల‌యంలో అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ నాన్‌వెజ్ తిన్నారు. చేపలు, బ‌సంతి పులావ్‌తో కూడిన ఆల‌య సంప్ర‌దాయ‌మైన భోగ్ (నైవేద్యం)ను స్వీక‌రించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఈ ఆల‌యంలో కాళీమాత‌కు సంప్ర‌దాయం ప్ర‌కారం మేక మాంసం, చేప‌ల్ని నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. ఆ త‌ర్వాత ఆ నైవేద్యాన్ని ప్ర‌సాదంగా భ‌క్తుల‌కు పంచుతారు.

కాగా, ప్ర‌స్తుతం బెంగాల్‌లో దుర్గాపూజ వేళ మాంసాహారాన్ని తీసుకోవ‌డంపై చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే భ‌గేశ్వ‌ర్ ధామ్‌కు చెందిన ధీరేంద్ర శాస్త్రి ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. దుర్గా పూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. దుర్గాపూజ వేళ నాన్ వెజ్ తింటున్న బెంగాలీల‌ను పాకండులుగా అభివ‌ర్ణించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో నాన్‌వెజ్ అంశంపై జోరుగా చ‌ర్చ మొదలైంది. ఈ నేప‌థ్యంలో సీఎం కాళీ మాత ఆల‌యాన్ని సంద‌ర్శించి నాన్‌వెజ్ ప్ర‌సాదాన్ని స్వీక‌రించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read..

క‌శ్మీరీలు జైల్లో ఉండాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోందా..? : వందేమాత‌రం ఆలాప‌న‌పై మిత్ర‌ప‌క్షాన్ని ప్ర‌శ్నించిన సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా

మ‌హారాష్ట్ర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 14 మంది మృతి

మ‌ల‌యాళ బ్యూటీతో రామ్ రొమాన్స్ - తెలుగులో మ‌రో ఛాన్స్ కొట్టేసిన సంయుక్త‌

Advertisement
Advertisement