Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
Planetary Events | స్కైచార్స్‌కు గుడ్‌న్యూస్ ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనువిందు చేయనున్నారు. అమావాస్య, పౌర్ణమి, ఉల్కాపాతం సహా పలు విశేషాలు కనిపించనున్నాయి. ఇందులో కొన్ని సాధారణ కంటితోనే వీక్షించేందుకు అవకాశం ఉంది. మరికొన్ని ఈవెంట్స్‌ను మాత్రం బైనాక్యులర్స్, టెలిస్కోప్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపించనున్నాయి.
Planetary Events | స్కైచార్స్‌కు గుడ్‌న్యూస్ ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనువిందు చేయనున్నారు. అమావాస్య, పౌర్ణమి, ఉల్కాపాతం సహా పలు విశేషాలు కనిపించనున్నాయి. ఇందులో కొన్ని సాధారణ కంటితోనే వీక్షించేందుకు అవకాశం ఉంది. మరికొన్ని ఈవెంట్స్‌ను మాత్రం బైనాక్యులర్స్, టెలిస్కోప్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపించనున్నాయి. ఇటీవల అంగారకుడు, యురేనస్ గ్రహాల సంయోగం ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేసింది. అలాగే, భూమి తన కక్ష్యలో సూర్యుడికి అత్యంత దూరమైన స్థానానికి చేరుకుంది. ఈ ఖగోళ సంఘటనను ‘అపహేలి’ (Aphelion)గా పిలుస్తారు. ఈ సమయంలో భూమి, సూర్యుడి మధ్య దూరం సుమారు 152.1 మిలియన్ కిలోమీటర్లకు చేరుకుంది. జులై 11, 12 తేదీల్లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రసిద్ధ ‘మాన్‌హాటన్‌హెంజ్’ దృశ్యం కనిపించనుంది.
సూర్యాస్తమయ సమయంలో నగరంలోని తూర్పు-పడమర వీధులకు సమాంతరంగా సూర్యుడు అస్తమిస్తుండడంతో.. ఎత్తయిన భవనాల మధ్య అగ్నిగోళంలా మెరిసే అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ అరుదైన సంఘటనను చూసేందుకు ప్రతి ఏడాది వేలాది మంది ఫోటోగ్రాఫర్లు, ఖగోళ ప్రియులు అక్కడికి చేరుకుంటారు. జులై 14న అమావాస్య ఏర్పడనుంది. ఆ రోజు చంద్రకాంతి లేకపోవడంతో రాత్రి ఆకాశం మరింత చీకటిగా ఉంటుంది. దీంతో పాలపుంత కేంద్ర భాగం, ప్రకాశవంతమైన నక్షత్ర మండలాలు, దూర ఖగోళ వస్తువులను పరిశీలించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఖగోళ పరిశీలనకు ఇది ఉత్తమ అవకాశంగా పేర్కొంటున్నారు. జులై 17న సూర్యాస్తమయం అనంతరం పశ్చిమ వాయువ్య దిశలో సన్నని చంద్రవంక, శుక్రగ్రహం ఒకదానికొకటి అత్యంత దగ్గరగా కనిపించనున్నాయి. ఈ అందమైన ఖగోళ దృశ్యాన్ని ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే సాధారణ కంటితో వీక్షించే అవకాశం ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆకాశాన్ని చూసే వారిని ప్రత్యేకంగా ఆకర్షించనుంది.
అలాగే, ఈ నెల 29న పౌర్ణమి దర్శనమివ్వనుంది. ఉత్తర అమెరికా సంప్రదాయాల ప్రకారం ఈ పౌర్ణమిని ‘బక్ మూన్’గా పిలుస్తారు. ఈ కాలంలో మగ జింకలకు కొత్త కొమ్ములు మొలకెత్తడం ప్రారంభమవుతుండడంతో ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ రోజు చంద్రుడు పూర్తి ప్రకాశంతో దర్శనమివ్వనున్నాడు. నెలాఖరులో 30, 31 తేదీల్లో ‘సదరన్ డెల్టా అక్వారిడ్స్’ ఉల్కాపాతం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు డజన్ల సంఖ్యలో ఉల్కలు ఆకాశంలో మెరుస్తూ కనిపించే అవకాశం ఉంది. ఈసారి చంద్రుడి కాంతి తక్కువగా ఉండడంతో మసకగా కనిపించే ఉల్కలను సైతం సులభంగా వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా వరకు స్పేస్ ఈవెంట్స్ ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే చూసేందుకు అవకాశం ఉంది. అయితే, మరింత స్పష్టంగా చూడాలంటే మాత్రం బైనాక్యులర్లు, టెలిస్కోప్ ఉపయోగించడం ఉత్తమం. ప్రాంతాన్ని బట్టి కనిపించే స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..
- ●ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
- ●Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది
- ●Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు
- ●Tamannaah | హీరోతో గొడవలు - సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు - చిక్కుల్లో తమన్నా బాలీవుడ్ మూవీ?
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?

Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది

Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు





