త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russia Sanctions Bill | ర‌ష్యా ఆంక్ష‌ల బిల్లుపై ట్రంప్ సంత‌కం.. ఇక భార‌త్‌పై 100% టారిఫ్స్‌..!

Russia Sanctions Bill | ర‌ష్యా ఆంక్ష‌ల బిల్లుపై (Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026) అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంత‌కం చేశారు. దీంతో ఇది చట్టంగా మారింది. ర‌ష్యా నుంచి చ‌మురు, గ్యాస్ కొనుగోలు చేసే భార‌త్ స‌హా ప‌ది దేశాల‌పై 100 శాతం సుంకాలు విధించే అవ‌కాశం ఉంది.

D

National | Published On Sep 19, 2026, 11.16 am IST

Russia Sanctions Bill | ర‌ష్యా ఆంక్ష‌ల బిల్లుపై ట్రంప్ సంత‌కం.. ఇక భార‌త్‌పై 100% టారిఫ్స్‌..!
Advertisement

Russia Sanctions Bill | త్రినేత్ర‌.న్యూస్ : ఉక్రెయిన్‌తో సుదీర్ఘ‌కాలం యుద్ధం కొన‌సాగిస్తోన్న మాస్కోపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే లక్ష్యంతో రూపొందించిన ర‌ష్యా ఆంక్ష‌ల బిల్లుపై (Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026) అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంత‌కం చేశారు. రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని ప్రతినిధుల సభ (House of Representatives) 262-159 ఓట్ల తేడాతో ఈ ఆంక్షల బిల్లును ఆమోదించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు ట్రంప్ కూడా ఆమోదముద్ర వేశారు. అధ్య‌క్షుడి సంత‌కంతో ఈ బిల్లు చట్ట‌రూపం దాల్చింది. రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు, ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం అధ్యక్షుడికి కల్పిస్తోంది. దీంతో ర‌ష్యా నుంచి చ‌మురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాల‌పై ఏ క్ష‌ణ‌మైనా సుంకాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

భార‌త్‌పై 100% టారిఫ్స్‌..

పాశ్చాత్య దేశాల ఆంక్షలను పక్కనపెట్టి రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే టాప్-5 దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై గరిష్ఠంగా 100 శాతం వరకు అదనపు సుంకాలు (Secondary Tariffs) విధించే విస్తృత అధికారాన్ని ఈ చట్టం ట్రంప్‌నకు కల్పిస్తుంది. భార‌త్‌తోపాటూ చైనా, స్లోవేకియా, హంగేరి, అజర్‌బైజాన్ దేశాలు మాస్కో నుంచి అత్య‌ధికంగా చ‌మురు దిగుమ‌తి చేసుకుంటున్నాయి. రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాల్లో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జియం ఉన్నాయి. అయితే, సుంకాలు ఏ దేశంపై ఎంత విధించాల‌న్న‌ది పూర్తిగా ట్రంప్ నిర్ణ‌యంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌రోవైపు ర‌ష్యా చ‌మురు కొనుగోళ్ల విష‌యంలో భారత్ తన స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోంది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడం తమ ప్రాధమిక లక్ష్యం అని భారత ప్రభుత్వం ఇప్ప‌టికే స్పష్టం చేసింది.

ఈ కొత్త చట్టం ప్రకారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు, ఉన్నతాధికారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రక్షణ, ఇంధన రంగాలపై అమెరికా ఆంక్షలు విస్తరించనున్నాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లను కూడా ఈ చట్టం లక్ష్యంగా చేసుకుంది. దీంతో పాటు ఇరాన్‌పై ఇప్పటికే ఉన్న ఆయుధ, ఇంధన రంగాల ఆంక్షలను మరో ఐదేళ్ల పాటు పొడిగించారు.

Also Read..

ప‌రీక్ష‌లో చాట్‌జీపీటీ వాడుతూ అడ్డంగా దొరికిపోయి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

భ‌ర్త క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. కుమారుడితో క‌లిసి దారుణ హ‌త్య‌

వైన్ షాపులో చెల‌రేగిన మంట‌లు.. రూ. 1.2 కోట్ల మ‌ద్యం అగ్నికి ఆహుతి

Advertisement
Advertisement