త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rangareddy | వైన్ షాపులో చెల‌రేగిన మంట‌లు.. రూ. 1.2 కోట్ల మ‌ద్యం అగ్నికి ఆహుతి

Rangareddy | రంగారెడ్డి జిల్లా కందుకూరులో శ‌నివారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కందుకూరు మండ‌ల కేంద్రంలోని జై భ‌వాని వైన్ షాపులో మంట‌లు చెల‌రేగాయి.

S

Hyderabad | Published On Sep 19, 2026, 10.07 am IST

Rangareddy | వైన్ షాపులో చెల‌రేగిన మంట‌లు.. రూ. 1.2 కోట్ల మ‌ద్యం అగ్నికి ఆహుతి
Advertisement

Rangareddy | త్రినేత్ర‌.న్యూస్ : రంగారెడ్డి జిల్లా కందుకూరులో శ‌నివారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కందుకూరు మండ‌ల కేంద్రంలోని జై భ‌వాని వైన్ షాపులో మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్తమైన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

ఫైర్ ఇంజిన్లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకునే లోపే.. మ‌ద్యం దుకాణం పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఈ ప్ర‌మాదంతో సుమారు రూ. 1.2 కోట్ల విలువైన మ‌ద్యం, రూ. 60 వేల న‌గ‌దు అగ్నికి ఆహుతి అయిన‌ట్లు య‌జ‌మాని తెలిపారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాప‌క సిబ్బంది ఆల‌స్యంగా రావ‌డంతోనే.. మ‌ద్యం దుకాణం పూర్తిగా కాలిపోయి, భారీగా న‌ష్టం వాటిల్లింద‌ని య‌జ‌మాని ఆరోపించారు.

Advertisement
Advertisement