IIT Bombay Student | పరీక్షలో చాట్‌జీపీటీ వాడుతూ అడ్డంగా దొరికిపోయి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య
IIT Bombay Student | పవాయ్‌లోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో (IIT Bombay Student) ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవలే జరిగిన పరీక్షలో సాహిల్ అనే విద్యార్థి చాట్‌జీపీటీలో ప్రశ్నాపత్రాన్ని(ChatGPT During Exam) అప్‌లోడ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో మనస్తాపంతో అతడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
IIT Bombay Student | త్రినేత్ర.న్యూస్ : ఐఐటీ బాంబేలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవలే జరిగిన పరీక్ష సమయంలో సదరు విద్యార్థి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వర్సిటీ యాజమాన్యానికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన అతడు శుక్రవారం రాత్రి క్యాంపస్‌లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవాయ్‌లోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ అనే 19 ఏళ్ల విద్యార్థి.. ఇటీవలే జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి సమాధానాలు వెతుకుతూ దొరికిపోయాడు. అయితే, ఇన్‌స్టిట్యూట్ అధికారులు సదరు విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలూ తీసుకోలేదు. డిపార్ట్‌మెంట్ హెడ్ సాహిల్‌ను పిలిచి కేవలం కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఈ ఘటన తన అకడమిక్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపదని భరోసా ఇచ్చారు. అంతేకాదు, మళ్లీ ఇలాంటి ఘటనకు పాల్పడొద్దని చెప్పి పంపించేశారు.
ఆ తర్వాత సాహిల్ పరీక్షలో మొబైల్ వాడారన్న ప్రచారం వర్సిటీలో మొదలైంది. దీంతో సాహిల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. క్యాంపస్‌లో విద్యార్థులు తరచూ ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆందోళనకు దిగారు. వరుస ఆత్మహత్యలపై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు క్యాంపస్‌లో భద్రతను పెంచారు. మరోవైపు, విద్యార్థులతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్చలు జరిపింది. మృతిచెందిన విద్యార్థికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చింది. మరోవైపు సాహిల్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఏడాది ఐఐటీ బాంబేలో చోటు చేసుకున్న నాలుగో మరణం ఇది.
Also Read..
మహిళను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hafizpet | మహిళను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్
- ●Medak | భర్త కళ్లలో కారం చల్లి.. కుమారుడితో కలిసి దారుణ హత్య
- ●Rangareddy | వైన్ షాపులో చెలరేగిన మంటలు.. రూ. 1.2 కోట్ల మద్యం అగ్నికి ఆహుతి
- ●Kazipeta | కాజీపేటలో రూ. 1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ పట్టివేత
- ●Apple Pay | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ పే సేవలు..
- ●TSLPRB | పోలీసు ఉద్యోగార్ధులకు ఉచిత కోచింగ్.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!

Hafizpet | మహిళను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్

Medak | భర్త కళ్లలో కారం చల్లి.. కుమారుడితో కలిసి దారుణ హత్య

Rangareddy | వైన్ షాపులో చెలరేగిన మంటలు.. రూ. 1.2 కోట్ల మద్యం అగ్నికి ఆహుతి

Kazipeta | కాజీపేటలో రూ. 1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ పట్టివేత






