త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medak | భ‌ర్త క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. కుమారుడితో క‌లిసి దారుణ హ‌త్య‌

Medak | భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌లెత్తిన వివాదం.. చివ‌ర‌కు హ‌త్య‌కు దారి తీసింది. భ‌ర్త క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. కుమారుడితో క‌లిసి హ‌త్య‌కు పాల్ప‌డింది భార్య‌.

S

Telangana | Published On Sep 19, 2026, 10.21 am IST

Medak | భ‌ర్త క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. కుమారుడితో క‌లిసి దారుణ హ‌త్య‌
Advertisement

Medak | త్రినేత్ర‌.న్యూస్ : భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌లెత్తిన వివాదం.. చివ‌ర‌కు హ‌త్య‌కు దారి తీసింది. భ‌ర్త క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. కుమారుడితో క‌లిసి హ‌త్య‌కు పాల్ప‌డింది భార్య‌. ఈ ఘ‌ట‌న మెద‌క్ జిల్లా తుప్రాన్ మండ‌లం ఇస్లాంపూర్‌లో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కొండాపురం రాములు(50) త‌న భార్య‌, కుమారుడితో క‌లిసి బోర్‌వెల్ రిగ్ వ‌ద్ద ప‌ని చేస్తూ జీవ‌నోపాధి పొందుతున్నారు. అయితే శుక్ర‌వారం రాత్రి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వివాదం చెల‌రేగింది. దీంతో స‌హ‌నం కోల్పోయిన భార్య‌.. త‌న భ‌ర్త క‌ళ్ల‌లో కారం చ‌ల్లింది. ఇదే స‌మ‌యంలో కుమారుడితో క‌లిసి భ‌ర్త‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేసింది. అనంత‌రం నిందితులిద్ద‌రూ పోలీసుల ఎదుట లొంగిపోయిన‌ట్లు స‌మాచారం. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుప్రాన్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement