Heavy Rain | రెయిన్ అలర్ట్.. మధ్యాహ్నం తర్వాత ఈ జిల్లాల్లో భారీ వర్షం
Heavy Rain | రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Heavy Rain | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షం (Heavy Rain) బీభత్సం సృష్టించిన విషయం తెలిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వరణుడు విరుచుకుపడ్డాడు. కుండపోతగా కురిసిన వానతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. దీంతో వాహనదారులు నరకం అనుభవించారు. నగరంతోపాటు నల్లగొండ, సూర్యాపేట, నిర్మల్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి.
బుధవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా నల్లగండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, యాదాద్రి, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదేసమయంలో సుమారు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఇక మధ్యాహ్నం వరకు రాష్ట్రవ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీలు, హైదరాబాద్‌లో 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మధ్యాహ్నం తర్వాత ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
- ●RAAKA | బన్నీ అభిమానులకు గుడ్న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!
- ●Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!

RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ

RAAKA | బన్నీ అభిమానులకు గుడ్న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?

Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!




