TMC | టీఎంసీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. మరో ఎంపీ రిజైన్
TMC | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి మరో షాక్ తగిలింది. ఎంపీ ప్రకాష్ చిక్ బరైక్ (MP Prakash Chikbaraik) పార్టీలోని అన్ని పదవులతోపాటూ ఎగువ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
TMC | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఇప్పుడు మరో ఎంపీ (Rajya Sabha MP) కూడా అదేబాట పట్టారు. ఎంపీ ప్రకాష్ చిక్ బరైక్ (MP Prakash Chikbaraik) పార్టీలోని అన్ని పదవులతోపాటూ ఎగువ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తిడీ లేదని ఈ సందర్భంగా బరైక్ స్పష్టం చేశారు.
ఇటీవలే రాజ్యసభకు సుస్మితా దేవ్ (Sushmita Dev), దీదీకి అత్యంత నమ్మకస్థుడుగా పేరొందిన సుఖేందు శేఖర్ రాయ్ (Sukhendu Sekhar Roy) రాజీనామా చేయగా నేడు ప్రకాష్ సైతం రిజైన్ చేయడంతో వారంలోనే టీఎంసీ రాజ్యసభ సభ్యుల రాజీనామాల సంఖ్య మూడుకు చేరింది. చిక్‌బరైక్ రాజీనామాతో రాజ్యసభలో ఆ పార్టీ బలం 10కు తగ్గింది. రాబోయే వారం రోజుల్లో మరో ముగ్గురు టీఎంసీ రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. అటు దిగువ సభలోనే 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు, జాదవ్‌పూర్ లోక్‌సభ ఎంపీ (Trinamool MP) సాయోని ఘోష్ (Saayoni Ghosh) సైతం రెబల్ వర్గానికి మద్దతుగా సంతకం చేశారు.
Also Read..
ఖమ్మంలో భారీ చోరీ.. కోటి విలువైన సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'
- ●Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు
- ●పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం
- ●PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ..?
- ●Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్
- ●Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'

Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు

పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం

PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ..?






