Kavitha | ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం
Kavitha | వచ్చే నెల 2న ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉద్యమకారులకు 250 గజాల భూ పంపిణీ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
- అన్ని వర్గాల ప్రజలు తరలొచ్చి విజయవంతం చేయాలి
- ఉద్యమకారులను వెంటనే గుర్తించి వారికి భూమి ఇవ్వాలి
- ఉద్యమకారుల భూ పోరాటం పోస్టర్ ఆవిష్కరణలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
త్రినేత్ర.న్యూస్: వచ్చే నెల 2న ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉద్యమకారుల భూ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని కోరారు. ఈమేరకు బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్‌ను గురువారం ఉదయం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల భూ పంపిణీ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

ప్రభుత్వం తాత్సారం చేస్తోంది..
జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భూపోరాటం చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటాం. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందే. మరోమారు కొంతమంది వ్యక్తులు, శక్తులు తెలంగాణవాదం మీద దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారు. అందుకే వాళ్ల కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కవిత పిలుపునిచ్చారు.
ఇది చారిత్రక కర్తవ్యం..
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం మనందరి చారిత్రక కర్తవ్యం. ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్లంతా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలి. మీ భవిష్యత్ కోసం ఉద్యమకారులు వాళ్ల జీవితాలనే త్యాగం చేశారు. వారికి మంచి చేసే కార్యక్రమంలో మనమంతా పాల్గొనాలి అని టీఆర్ఎస్ చీఫ్ కవిత కోరారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Boora Narsaiah Goud | తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
- ●Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం
- ●LPG e-KYC Deadline 2026 | గ్యాస్ కనెక్షన్ ఉందా? e-KYC లాస్ట్ డేట్ పెంపు.. మొబైల్లోనే ఇలా ఈజీగా పూర్తి చేయండి
- ●MLA Rajagopal Reddy | రేవంత్‌కు బాకా కొట్టండి.. కానీ మా జోలికొస్తే ఖబర్దార్
- ●TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'
- ●Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు

Boora Narsaiah Goud | తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి

Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం

LPG e-KYC Deadline 2026 | గ్యాస్ కనెక్షన్ ఉందా? e-KYC లాస్ట్ డేట్ పెంపు.. మొబైల్లోనే ఇలా ఈజీగా పూర్తి చేయండి

MLA Rajagopal Reddy | రేవంత్‌కు బాకా కొట్టండి.. కానీ మా జోలికొస్తే ఖబర్దార్




