Telangana BJP | NEXT తెలంగాణ షురూ.. కార్యాచరణ మొదలు పెట్టిన బీజేపీ
Telangana BJP | NEXT తెలంగాణ నినాదంతో వచ్చేసారి అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ( BJP ).. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించింది. పార్టీ అగ్ర నాయకత్వం ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పి ప్రత్యేకంగా పంపించిన సునీల్ బన్సల్( Sunil Bansal ) రంగంలోకి దిగారు.
- రంగంలోకి దిగిన సునీల్ బన్సల్
- 2 ఎమ్మెల్సీలను గెలిచి..
- విజయ సందేశం పంపాలని సంకల్పం
- లీడర్లందరికీ గట్టిగా క్లాస్
- చేతకాకుంటే పదవులు వదిలేయాలని సూచన
- హైదరాబాద్‌ను వదిలి.. ఫీల్డ్‌లో పనిచేయాలని హెచ్చరిక
- టార్గెట్ 2028ను సీరియస్‌గా తీసుకోవాలంటూ ఆదేశం
- 2న హైదరాబాద్ రానున్న అమిత్ షా
- బహిరంగ ర్యాలీకి భారీగా జన సమీకరణ యత్నాలు
- అదే రోజు నేతలకు దిశానిర్దేశం
Telangana BJP | త్రినేత్ర న్యూస్ : NEXT తెలంగాణ నినాదంతో వచ్చేసారి అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ( BJP ).. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించింది. పార్టీ అగ్ర నాయకత్వం ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పి ప్రత్యేకంగా పంపించిన సునీల్ బన్సల్( Sunil Bansal ) రంగంలోకి దిగారు. రెండు ఎమ్మెల్సీలను దక్కించుకొని.. రాష్ట్రంలో కొత్త మార్పు చోటు చేసుకోబోతుందన్న సందేశాన్ని పంపాలని పార్టీ భావిస్తున్నది. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో నవంబరు 2న రాష్ట్ర బీజేపీ చేపడుతున్న లోక్ తంత్ర బచావో భీడ్ తంత్ర హఠావో (ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. అరాచకత్వాన్ని పారదోలండి) భారీ ర్యాలీకి హోం మంత్రి అమిత్ షా రానున్నారు. అదే రోజు రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.

చేతకాకపోతే.. వేరేవాళ్లకివ్వండి
రాష్ట్ర బీజేపీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బన్సల్ రెండు రోజుల క్రితం జరిగిన ప్రత్యేక సమావేశంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పదాధికారులతో సమావేశమయ్యారు. వారి పనితీరుపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా కొందరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సన్నద్ధతపై చాలామంది తమకేమీ పట్టనట్లు ఉండడాన్ని ఆయన ఎత్తి చూపారు. సర్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టేలా క్షేత్ర స్థాయిలో ఎవరూ నామమాత్రంగా కూడా కౌంటర్ నిరసనలు చేయలేదని చెప్పారు. జనంలో ఉండి వారందరికీ చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి.. హైదరాబాద్‌లోనే ఉంటూ పనులు చక్కబెట్టుకుంటున్నారని సీరియస్ అయ్యారు. పార్టీ ఇచ్చిన పదవులను బాధ్యతగా భావించి విధులు నిర్వర్తించాలని.. ఒకవేళ నిబద్ధతగా పనిచేయడం చేత కాకపోతే వాటిని వదులుకొని వేరే వారికి అవకాశం ఇవ్వాలని హెచ్చరించారు.
ఎమ్మెల్సీలు గెలవాలి.. మార్పు చూపించాలి
2028 లేదా 2029లో జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా గెలిచి తీరుతుందనే నమ్మకం కలిగించాలంటే.. ఇప్పుడు జరగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించాలని బన్సల్ సూచించారు. ఇందుకోసం పార్టీ సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటి నుంచే తమ తమ నియోజకవర్గాల్లో పర్యటనలు మొదలు పెట్టాలని సూచించారు.
భారీగా జన సమీకరణ
కాగా.. సర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ర్యాలీలకు కౌంటర్‌గా.. బీజేపీ లోక్ తంత్ర బచావో పేరుతో ర్యాలీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నవంబరు 2న భారీ ర్యాలీ నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. ఈ ర్యాలీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ర్యాలీ రోజే.. 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు అమిత్ షా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించనున్నట్టు సమాచారం.
తాజావార్తలు
- ●Husharu 2 | "హుషారు 2"లో ఆర్ నారాయణమూర్తి - మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్
- ●Global Summit 2026 | ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం
- ●Couples Suicide | గోడపై రాశారు.. రెండేళ్ల పాపను చంపి తనువులు చాలించారు.. అసలేం జరిగిందంటే!
- ●Dharmapuri Arvind | నిధులు లేవంటున్న సీఎంకు భిక్షాటన సొమ్ము పంపిస్తం
- ●Vande Mataram Controversy 2026 | వందేమాతరంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: వివాదాస్పద పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు
- ●Baby bottle gourds | సొరకాయల వ్యాపారం.. రోజుకు రూ. 50,000 సంపాదన..

Husharu 2 | "హుషారు 2"లో ఆర్ నారాయణమూర్తి - మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్

Global Summit 2026 | ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం

Couples Suicide | గోడపై రాశారు.. రెండేళ్ల పాపను చంపి తనువులు చాలించారు.. అసలేం జరిగిందంటే!

Dharmapuri Arvind | నిధులు లేవంటున్న సీఎంకు భిక్షాటన సొమ్ము పంపిస్తం





