త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Global Summit 2026 | ఇన్వెస్ట్‌ తెలంగాణ సమ్మిట్‌.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం

Global Summit 2026 | ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026లో పాల్గొనాల్సిందిగా 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఆహ్వానాలు పంపిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ సమ్మిట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

P

Telangana | Published On Oct 27, 2026, 7.01 pm IST

Global Summit 2026 | ఇన్వెస్ట్‌ తెలంగాణ సమ్మిట్‌.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం
Advertisement
  • డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో సమ్మిట్‌
  • న్యూఢిల్లీలో ఈ నెల 29న కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం
  • స‌మీక్షించిన సీఎస్ సంజ‌య్ జాజు

Global Summit 2026 | ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026లో పాల్గొనాల్సిందిగా 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఆహ్వానాలు పంపిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ సమ్మిట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమ్మిట్‌ ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం, యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా సమ్మిట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సీఎస్‌ తెలిపారు.

అంత‌ర్జాతీయ గుర్తింపును తీసుకువ‌చ్చేలా..

సమ్మిట్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఈ నెల 29న న్యూఢిల్లీలో కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని, వివిధ దేశాల రాయబారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల అధిపతులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో రోడ్‌షోలు నిర్వహించామని, ప్రధాన సమ్మిట్‌కు 1,500కు పైగా కంపెనీలు, సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సమ్మిట్‌లో భాగంగా నిర్వహించే రక్షా ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు చెందిన సుమారు 100 దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు సంజయ్‌ జాజు తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక ఆహ్వానాలు పంపామని, ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.

25 సెక్టార్లుగా ప్రధాన వేదిక

ఫ్యూచర్‌ సిటీలో సమ్మిట్‌ జరిగే ప్రధాన వేదికను 25 సెక్టార్లుగా విభజించి ప్లీనరీ సమావేశాలు, సెమినార్లు, చర్చలు, ఒప్పందాలు, ఎగ్జిబిషన్లు, కంపెనీల ప్రదర్శనలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్‌ వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, వసతి, సమావేశాల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రతినిధికి సమన్వయ బాధ్యతలు నిర్వహించేందుకు సీనియర్‌ అధికారిని నోడల్‌ అధికారిగా నియమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

Advertisement
Advertisement