Couples Suicide | గోడపై రాశారు.. రెండేళ్ల పాపను చంపి తనువులు చాలించారు.. అసలేం జరిగిందంటే!
Couples Suicide | ఏం కష్టమొచ్చిందో.. ఏమనుకున్నరో.. ఏమైందో గానీ రెండేళ్ల పేగు బంధాన్ని చేజేతులా తెంచేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దంపతులూ ఆత్మహత్య(Couples Suicide)కు ఒడిగట్టారు.
Couples Suicide | త్రినేత్ర న్యూస్: ఏం కష్టమొచ్చిందో.. ఏమనుకున్నరో.. ఏమైందో గానీ రెండేళ్ల పేగు బంధాన్ని చేజేతులా తెంచేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దంపతులూ ఆత్మహత్య(Couples Suicide)కు ఒడిగట్టారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్‌లో మంగళవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపి (Gopi), సమత (Samatha) దంపతులు కేపీహెచ్‌బీలో నివసిస్తున్నారు. వీరికి స్నిగ్ద అనే రెండేళ్ల వయసున్న పాప ఉంది. ఇంతలో ఉన్నట్టుండి పాపను చంపేసి వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘‘ఇది మాకు మేం తీసుకున్న నిర్ణయం. ఈ విషయంలో ఎవరి ప్రమేయం లేదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. మా స్నేహితులను, సంబంధికులను మా చావు విషయం గురించి అడగొద్దు. మేం తప్పుడు నిర్ణయం తీసుకున్నామని తెలుసు. మమ్మల్ని క్షమించండి’’.. అని పెన్నుతోని గోడపై సూసైడ్ సందేశం రాసి తనువులు చాలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఎంత కష్టమొచ్చిందో..
కూకట్‌పల్లిలో విషాదం.. రెండేళ్ల కుమార్తెతో సహా దంపతుల ఆత్మహత్య
కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్‌లో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపి, సమతగా గుర్తించారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఇతరులను వివరాలు అడగవద్దని గోడపై రాశారు.
— TNews Telugu (@TNewsTelugu) October 27, 2026
సంబంధిత వార్తలు

Global Summit 2026 | ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం
అక్టోబర్ 27, 2026

Maheshkumar Goud | తెలంగాణల మళ్లా మేమే గెలుస్తం.. బీజేపీకి ఆ ఛాన్స్ లేనేలేదు
అక్టోబర్ 27, 2026

AssetMark Hyderabad GCC | సీబీఐటీ విద్యార్థులకు గోల్డెన్ చాన్స్.. అమెరికా కంపెనీలో జాబ్
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Husharu 2 | "హుషారు 2"లో ఆర్ నారాయణమూర్తి - మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్
- ●Telangana BJP | NEXT తెలంగాణ షురూ.. కార్యాచరణ మొదలు పెట్టిన బీజేపీ
- ●Global Summit 2026 | ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం
- ●Dharmapuri Arvind | నిధులు లేవంటున్న సీఎంకు భిక్షాటన సొమ్ము పంపిస్తం
- ●Vande Mataram Controversy 2026 | వందేమాతరంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: వివాదాస్పద పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు
- ●Baby bottle gourds | సొరకాయల వ్యాపారం.. రోజుకు రూ. 50,000 సంపాదన..

Husharu 2 | "హుషారు 2"లో ఆర్ నారాయణమూర్తి - మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్

Telangana BJP | NEXT తెలంగాణ షురూ.. కార్యాచరణ మొదలు పెట్టిన బీజేపీ

Global Summit 2026 | ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం

Dharmapuri Arvind | నిధులు లేవంటున్న సీఎంకు భిక్షాటన సొమ్ము పంపిస్తం



