Khammam | ఖమ్మంలో భారీ చోరీ.. కోటి విలువైన సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు
Khammam | ఖమ్మం నగరంలో (Khammam) భారీ దొంగతనం జరిగింది. నగరంలోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో (Sono Vision Showroom) పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్లు (Cell Phones) చోరీ చేశారు.
Khammam | త్రినేత్ర.న్యూస్: ఖమ్మం నగరంలో (Khammam) భారీ దొంగతనం జరిగింది. నగరంలోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో (Sono Vision Showroom) పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్లు (Cell Phones) చోరీ చేశారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కారులో వచ్చిన దుండగులు.. షట్టర్లకు వేసిన తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. సుమారు రూ.కోటికి పైగా విలువైన 100కు పైగా సెల్‌ఫోన్లు అపహరించారు.
విజయవాడలో మోగిన అలారం
అయితే షెట్టర్లకు తాళాలు పగలగొట్టడంతో విజయవాడ సోనోవిజన్ ప్రధాన కార్యాలయంలో అలారం మోగింది. దీంతో వారు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు షోరూం వద్దకు చేరుకునేప్పటికే పని పూర్తి చేసుకున్న దొంగలు కారులో ప్రయాణం అవుతున్నారు. గమనించిన సిబ్బంది వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. తప్పించుకున్న దొంగలు వైరా వైపు వెళ్లిపోయారు.
పోలీసులు అప్రమత్తం
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. షోరూంలో ఉన్న సీసీకెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ షోరూంని పరిశీలించారు. జిల్లాని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసిన అధికారులు జిల్లా సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.
ఖమ్మంలో సోనో విజన్ షోరూంలో భారీ చోరీ
రూ.2 కోట్ల విలువైన ఐ ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు
కారులో వచ్చి దర్జాగా లూటీ
అలారం మోగడంతో అలర్ట్ అయిన సోనోవిజన్ సిబ్బంది
అడ్డుకోబోయిన వారి నుంచి తప్పించుకున్న దుండగులు
స్టాక్ వచ్చిన కొన్ని గంటల్లోనే దోపిడీ జరగడంపై పోలీసుల అనుమానం
ఘటనా… pic.twitter.com/k4ZkBgxUaD
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 11, 2026
తాజావార్తలు
- ●Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
- ●Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
- ●Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి

Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..






