Virosh Wedding | పెళ్లి ఫొటోలతో చరిత్ర సృష్టించిన విరోష్ జోడీ.. కోహ్లీ రికార్డు కూడా బద్దలే
Virosh Wedding | విరోష్ జంట సోషల్ మీడియాలో అరుదైన రికార్డు బ్రేక్ చేసింది. పెళ్లి ఫొటోలతో (wedding post) సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియాలోనే అత్యధిక లైకులు పొందిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుగా (MOST LIKED Instagram post in Asia) నిలిచింది.
Virosh Wedding | ప్రస్తుతం ఎక్కడ చూసినా టాలీవుడ్ స్టార్స్ విజయ్ (Vijay Deverakonda)-రష్మిక (Rashmika Mandanna) వివాహం గురించే చర్చ జరుగుతోంది. ఈనెల 26న వీరి వివాహం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి ఫొటోలను కూడా ఈ జంట సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో విరోష్ జంట సోషల్ మీడియాలో అరుదైన రికార్డు బ్రేక్ చేసింది. పెళ్లి ఫొటోలతో (wedding post) సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది.
విరోష్@ 41.6 మిలియన్స్ లైక్స్
పెళ్లి తర్వాత విరోష్ జోడీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కేవలం 24 గంటల్లోనే అత్యధిక లైక్‌లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో భారతీయ సెలబ్రిటీలపై ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. పెళ్లి ఫొటోలను గురువారం సాయంత్రం ఈ జంట సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉదయం నాటికి రష్మిక వెడ్డింగ్ పోస్ట్‌కు ఏకంగా 23.2 లైక్స్ వచ్చాయి. ఇక విజయ్ పోస్ట్‌కు 18.4 మిలియన్ల లైక్స్‌లు వచ్చాయి. మొత్తంగా విరోష్ జోడీ పోస్టులను 41.6 మిలియన్ల మంది లైక్ చేశారు. దీంతో వీరి పెళ్లి పోస్టు ఆసియాలోనే అత్యధిక లైకులు పొందిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుగా (MOST LIKED Instagram post in Asia) నిలిచింది.
కోహ్లీ రికార్డును తిరగరాసిన రష్మిక పోస్టు
తమ పెళ్లి ఫొటోలతో విరోష్ జోడీ.. పరుగుల రారాజు విరాట్ కోహ్లీ నెలకొల్పిన రికార్డును కూడా అధిగమించడం విశేషం. 2024 టీ 20 వరల్డ్ కప్ విజయం తర్వాత కోహ్లీ పెట్టిన పోస్టుకు 22.8 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకూ ఆసియాలో ఇదే అత్యధిక లైక్స్ పొందిన పోస్టుగా టాప్‌లో ఉంది. ఇప్పుడు ఆ పోస్టును రష్మిక పోస్టు తిరగరాయడం విశేషం.
సినీ సెలబ్రిటీల రికార్డులు కూడా బద్దలే..
ఇక రష్మిక చేసిన పోస్టు ఇతర సినీ సెలబ్రిటీల రికార్డులను కూడా కొల్లగొట్టింది. గతంలో బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఫోటోలకు వచ్చిన 16 మిలియన్ల లైక్సే ఇప్పటివరకు అత్యధికం. అయితే ఆ రికార్డును విరోష్ జోడీ కేవలం 14 గంటల్లోనే (16.7 మిలియన్స్ లైక్స్) బ్రేక్ చేసింది. ఇతర ప్రముఖ జంటలైన అలియా భట్-రణబీర్ కపూర్ (13M+), మాజీ జంట సమంత-నాగ చైతన్య (12M+), కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ (10M+), మరియు దీపికా పదుకొణె-రణవీర్ సింగ్ (8M+) రికార్డులను కూడా ఈ జంట వెనక్కి నెట్టి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. దీన్నిబట్టే తెలుస్తోంది ఈ జంటకు సోషల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న – తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
జులై 26, 2026

Rashmika Mandanna | ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ బోల్డ్ మూవీ – పెళ్లికి ముందు సీక్రెట్ ఎఫైర్ బయటపడితే…
జులై 25, 2026

Rashmika Mandanna | పెళ్లి కూతురిలా రష్మిక మందన్న – రణబాలి పోస్ట్‌పోన్ రూమర్లపై క్లారిటీ
జులై 23, 2026
తాజావార్తలు
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ



