త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మార్కెట్ రేటు ప్ర‌కార‌మే యాద‌గిరిగుట్ట భూముల కేటాయింపు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేటు ప్రకారం భూమి కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వివిధ మఠాలకు భూముల కేటాయింపుపైన ఒక విధానం రూపొందించాలి అని సీఎం ఆదేశించారు.

S

Telangana | Published On Jun 30, 2026, 3.14 pm IST

CM Revanth Reddy | మార్కెట్ రేటు ప్ర‌కార‌మే యాద‌గిరిగుట్ట భూముల కేటాయింపు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేటు ప్రకారం భూమి కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వివిధ మఠాలకు భూముల కేటాయింపుపైన ఒక విధానం రూపొందించాలి అని సీఎం ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ బోధి పెవిలియ‌న్‌లో యాద‌గిరిగుట్ట ఆల‌య అభివృద్ధిపై సంబంధిత అధికారుల‌తో సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేశారు.

కుల సంఘాలకు స్థలం కేటాయింపుపైన స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారుచేయాలి. భూమి యాజమాన్యపు హక్కులు టెంపుల్ వద్దనే ఉండాలి. భూముల కేటాయింపుపైన తిరుమల అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలి. గుట్టపైన గెస్ట్ హౌస్‌ల‌ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన వాళ్ల జాబితా రూపొందించాలి. విడతల వారీగా గెస్ట్ హౌస్‌ల‌ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి. గెస్ట్ హౌస్‌ల నిర్మాణంపైన తిరుమల మోడల్‌ను అనుసరించాలి. భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలి. యాదగిరిగుట్ట ఆలయం నిర్మాణంపైన ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపైన అధ్యయనం చేసి వారంలో నివేదిక ఇవ్వాలి. పబ్లిక్ ప్రైవేట్ విధానంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఈ స‌మీక్షా స‌మావేశానికి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ సెక్రటరీ మానిక్ రాజ్, సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులతో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement