Tirumala | శ్రీనివాసుడి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు రద్దు, ఆర్జిత సేవలు కూడా..
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు అలర్ట్. విశేష పర్వదినాల నేపథ్యంలో ఆలయ దర్శన వేళలు, సేవలలో టీటీడీ (TTD) మార్పు చేసింది.
Tirumala | త్రినేత్ర.న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు అలర్ట్. విశేష పర్వదినాల నేపథ్యంలో ఆలయ దర్శన వేళలు, సేవలలో టీటీడీ (TTD) మార్పు చేసింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam), ఈ నెల 17న ఆణివార ఆస్థానం కొలువును నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజుల్లో ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.
ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆణివార ఆస్థానం (Anivara Asthanam) కొలువును ఘనంగా నిర్వహించనున్నారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే ఈ చారిత్రాత్మక ఉత్సవాన్ని పురస్కరించుకుని, ఆలయ సాంప్రదాయాల ప్రకారం అంతకుముందు వచ్చే మంగళవారం అంటే జూలై 14న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ (ఆలయ శుద్ధి కార్యక్రమం) జరపనున్నారు. ఈనేపథ్యంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన ఇతరులందరికీ జూలై 14, జూలై 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను (VIP Break Darshan) టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా జూలై 13, జూలై 16వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు. కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపారు.
ఆర్జిత సేవలు రద్దు
జూలై 17న శ్రీవారి ఆలయంలో నిత్యం జరిగే పలు ఆర్జిత సేవలను (Arjitha Seva) రద్దుచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ రోజున నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంతో పాటు సహస్ర దీపాలంకరణ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం






