Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ స్టాక్‌లలో భారీగా కొనుగోళ్లు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలమైన లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు నమోదవడంతో ప్రధాన సూచీలు గ్యాప్ అప్‌తో ఓపెన్ అయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా ఎగబాకగా, నిఫ్టీ 24,100 స్థాయిని దాటి ట్రేడ్ అయింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలమైన లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు నమోదవడంతో ప్రధాన సూచీలు గ్యాప్ అప్‌తో ఓపెన్ అయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా ఎగబాకగా, నిఫ్టీ 24,100 స్థాయిని దాటి ట్రేడ్ అయింది. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 444.89 పాయింట్లు (0.58 శాతం) లాభంతో 77,631.76 వద్ద ట్రేడైంది. మరోవైపు నిఫ్టీ 116.10 పాయింట్లు (0.48 శాతం) పెరిగి 24,188.85 వద్ద కొనసాగింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.89 శాతం ఎగసి ప్రధానంగా మార్కెట్‌కు మద్దతు ఇచ్చింది. అయితే ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లు ఒత్తిడికి లోనవడంతో నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్‌కేర్ సూచీలు అత్యధిక నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మిగతా చాలా రంగాల సూచీలు కూడా ప్రారంభ సెషన్‌లో బలహీనంగానే కనిపించాయి.
ఐటీ షేర్ల ర్యాలీ..
బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇండిగో షేర్లు ప్రధాన లాభాల్లో నిలిచాయి. మరోవైపు ఎటర్నల్, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, ట్రెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కదిలాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటంతో హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.05 డాలర్లు (1.25 శాతం) పెరిగి 85.28 డాలర్లకు చేరుకుంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ధర కూడా 1.03 డాలర్లు (1.3 శాతం) పెరిగి బ్యారెల్‌కు 79.98 డాలర్లకు చేరుకుంది.
బలహీన పడిన రూపాయి..
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో ఐటీ రంగంలో నమోదైన బలమైన కొనుగోళ్లు ప్రారంభ సెషన్‌లో సూచీలను లాభాల్లో నిలబెట్టాయి. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి మరోమారు బలహీన ప్రదర్శన చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 0.01 శాతం నష్టపోయిన రూపాయి 96.34 వద్ద నిలిచింది.
తాజావార్తలు
- ●Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష
- ●Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు

Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం






