Suicide | పిల్లలను బావిలో తోసి.. ఆపై తానూ దూకి తల్లి ఆత్మహత్య
Suicide | రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో (Shankarpally) విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసిసిన తల్లి.. తానూ ఆత్మహత్య (Suicide) చేసుకుంది.
Suicide | త్రినేత్ర.న్యూస్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో (Shankarpally) విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసిసిన తల్లి.. తానూ ఆత్మహత్య (Suicide) చేసుకుంది. వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూరుకు చెందిన వసంత, సుధాకర్ దంపతులు శంకర్పల్లి సమీపంలో కొత్తపల్లిలో స్థిరపడ్డారు. వీరికి నవ్వ (15), పదేండ్ల కుమారుడు ఉన్నారు. అయితే గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన వసంత.. కూతురు నవ్య, కుమారుడిని బావిలోకి తోసి ఆపై ఆమె కూడా దూకేసింది.
అయితే నీటిలో మునిగి తల్లి, కూతురు మృతిచెందగా.. కుమారుడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని రక్షించారు. మృతదేహాలను బావి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో (Family Dispute) ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తున్నది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sonam Wangchuk | ఏం జరిగినా.. జులై 20 వరకూ ప్రాణాలతో ఉంటా : సోనమ్ వాంగ్చుక్
- ●MLC Shambhipur Raju | యువ సంగ్రామ సభకు ఎందుకు అనుమతివ్వరు.. ఎన్ని అడ్డంకులున్నా సక్సెస్ చేస్తం
- ●Heavy Rains | వరంగల్లో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
- ●Woman Was Killed | ప్రేమను నిరాకరించిందని.. బస్టాండ్లో యువతిని నరికి చంపిన యువకుడు
- ●CI Transfers | సైబరాబాద్ కమిషనరేట్లో భారీగా సీఐల బదిలీలు.. ఉత్తర్వలు జారీ చేసిన సీపీ
- ●New Pensions | అర్హులందరికీ కొత్త పెన్షన్లు.. ఆగస్టు 15 నుంచి పంపిణి: మంత్రి సీతక్క

Sonam Wangchuk | ఏం జరిగినా.. జులై 20 వరకూ ప్రాణాలతో ఉంటా : సోనమ్ వాంగ్చుక్

MLC Shambhipur Raju | యువ సంగ్రామ సభకు ఎందుకు అనుమతివ్వరు.. ఎన్ని అడ్డంకులున్నా సక్సెస్ చేస్తం

Heavy Rains | వరంగల్లో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం

Woman Was Killed | ప్రేమను నిరాకరించిందని.. బస్టాండ్లో యువతిని నరికి చంపిన యువకుడు






