Hyderabad | హైదరాబాద్‌లో బాలికలు, మహిళలపై నానాటికీ పెరుగుతున్న నేరాలు..
Hyderabad | హైదరాబాద్‌లో (Hyderabad) బాలికలు, యువతులపై నానాటికీ నేరాలు పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 17 ఏండ్ల యువతిని ప్రేమ పేరుతో వేధించిన ఓ వ్యక్తి.. తనపై పోక్సో కేసు (POCSO Case) పెట్టిందన్న కోపంతో బాధితురాలితో సహా ఆరుగురిని చంపిన విషయం తెలిసిందే. తాజాగా గత రెండు రోజుల్లోనే రాజధానిలో విద్యార్థినులను వేధించిన కేసులు మూడు నమోదయ్యాయి.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో (Hyderabad) బాలికలు, యువతులపై నానాటికీ నేరాలు పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 17 ఏండ్ల యువతిని ప్రేమ పేరుతో వేధించిన ఓ వ్యక్తి.. తనపై పోక్సో కేసు (POCSO Case) పెట్టిందన్న కోపంతో బాధితురాలితో సహా ఆరుగురిని చంపిన విషయం తెలిసిందే. తాజాగా గత రెండు రోజుల్లోనే రాజధానిలో విద్యార్థినులను వేధించిన కేసులు మూడు నమోదయ్యాయి.
బడికి వెళ్తున్న బాలికపై
సనత్‌నగర్ (Sanathnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్తున్న బాలికను వెంబడించిన షాబాబ్ అనే వ్యక్తి.. ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని సనత్‌నగర్ పరిధిలోని ఒక పార్కుకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైందికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు అఘాయిత్యానికి సంబంధించిన వివరాలను తల్లిదండ్రులకు చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాబాబ్‌పై పోక్సో కేసు (POCSO Case) నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.

9 ఏండ్ల బాలికతో అసభ్యంగా..
కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఎఫ్ బ్లాక్‌లో 9 ఏండ్ల బాలికతో ఓ వ్యక్తి అసభ్యంగా (Assault) ప్రవర్తించాడు. నీలోఫర్ దవాఖాన (Niloufer Hospital) వద్ద చాయ్ విక్రయిస్తూ జీవనం సాగించే హజీజ్ అబ్దుల్ అనే వ్యక్తి నాలుగో తరగతి చదువుతున్న బాలికకు ముద్దు పెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అదికాస్తా బయటకు రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతా కలిసి నిందితుడిపై దాడి చేయడంతో హజీజ్ తీవ్రంగా గాయడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఉస్మానియా దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

9వ తరగతి విద్యార్థినితో ఉపాధ్యాయుడి ప్రేమ..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన దంపతులు హైదరాబాద్‌లోని మూసాపేట జనతానగర్‌లో నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. కూలి పనిచేసుకుని జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమార్తె(14) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. అదే స్కూల్‌లో పోలాకి నరేశ్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాల సమయం ముగిశాక విద్యార్థులకు ట్యూషన్ సైతం చెప్పేవాడు. ఈ క్రమంలో సదరు బాలికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను మందలించారు. బుధవారం పాఠశాలకు వెళ్లిన వారు.. తమ కుమార్తెను నరేష్ ప్రేమ పేరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
గురువారం ఉదయం స్కూల్‌కి వెళ్లిన బాలిక.. మధ్యాహ్నం భోజనం చేయలేదు. దీంతో తోటి విద్యార్థులు అడగడంతో కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఉపాధ్యాయులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వరుసకు సోదరుడైన వ్యక్తితో మధ్యాహ్నం 3 గంటలకు బాలికను ఇంటికి పంపారు. అయితే ఇంటికి వెళ్లిన బాలిక.. నరేశ్‌కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. ఆందోళనకు గురైన అతడు బాలిక పెద్దమ్మకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. వారంతా ఇంటికెళ్లి చూడగా అప్పటికే ఆమె ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష
- ●Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు

Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం






