త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajdhani Express | షార్ట్‌ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం

Rajdhani Express | దేశంలో అత్యంత ర‌ద్దీగా ఉండే రైళ్ల‌లో ఒక‌టైన తిరువ‌నంత‌పురం-హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ (Trivandrum-Hazrat Nizamuddin) రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో (Rajdhani Express) భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

G

National | Published On May 17, 2026, 9.21 am IST

Rajdhani Express | షార్ట్‌ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం
Advertisement

Rajdhani Express | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో అత్యంత ర‌ద్దీగా ఉండే రైళ్ల‌లో ఒక‌టైన తిరువ‌నంత‌పురం-హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ (Trivandrum-Hazrat Nizamuddin) రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో (Rajdhani Express) భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం తెల్ల‌వారుజామున 5.15 గంట‌ల స‌మ‌యంలో రాజ‌స్థాన్‌లోని కోటా వ‌ద్ద‌ తిరువ‌నంత‌పురం నుంచి వెళ్తున్న ఢిల్లీ వెళ్తున్న రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లోని బీ-1 ఏసీ కోచ్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి బోగీ మొత్తానికి వ్యాపించ‌డంతో పెద్దఎత్తున అగ్నికీల‌లు ఎగ‌సిప‌డ్డాయి. అయితే అప్ర‌మ‌త్త‌మైన రైల్వే సిబ్బంది ప్ర‌యాణికుల‌ను అంద‌రిని దించేయ‌డంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింది. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని, అంతా క్షేమంగానే ఉన్నార‌ని అధికారులు చెప్పారు.

రైలులోని ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయ‌ని, ప్ర‌మాద స‌మ‌యంలో బోగీలో 68 మంది ప్రయాణికులు ఉన్నార‌ని తెలిపారు. కంపార్ట్‌మెంట్‌ నుంచి పొగ, మంటలు రావడం గమనించిన రైల్వే గార్డ్‌ లోకోపైలట్‌ను అప్రమత్తం చేశార‌న్నారు. వెంట‌నే రైలును నిలిపివేశార‌ని చెప్పారు. ప్ర‌మాదం జ‌రిగిన కోచ్‌ను రైలు నుంచి వేరుచేసిన త‌ర్వాత రైలు తిరిగి త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించింద‌ని వెల్ల‌డించారు. షార్ట్ స‌ర్య్కూట్ వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Advertisement
Advertisement