Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
Longest Non-Stop Train | త్రినేత్ర.న్యూస్: భారతీయ రైల్వే (Indian Railways) ఎన్నో విశిష్టతలకు నెలవు. తమ వేగంతో కొన్ని రైళ్లు, సదుపాయాలతో మరికొన్ని, దేశంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానిస్తూ ఇంకొన్ని రైళ్లు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కానీ, ఒక రైలు మాత్రం ఒక్క చోట కూడా ఆగకుండా అత్యధిక దూరం (Longest Non-Stop Train) ప్రయాణిస్తూ గుర్తింపును తెచ్చుకున్నది.
Longest Non-Stop Train | త్రినేత్ర.న్యూస్: భారతీయ రైల్వే (Indian Railways) ఎన్నో విశిష్టతలకు నెలవు. ప్రపంచంలోనే అత్యధిక రైల్వే నెట్‌వర్క్ కలిగిన వ్యవస్థగా, ఎక్కువ మంది ఉద్యోగులు కలిసిన సంస్థగా, తక్కువ ధరకే సేవలు అందిస్తూ సామాన్య ప్రజలకు చేరువైంది. ప్రతిరోజూ 2.3 కోట్లకు పైగా ప్రయాణికులను, 30 లక్షల టన్నుల సరుకును భారతీయ రైల్వే చేరవేస్తున్నది. రాజధాని (Rajdhani Express), శతాబ్ధి, దురంతో, వందే భారత్, మహారాజా ఎక్స్‌ప్రెస్, ప్యాలెస్ ఆన్ వీల్స్ వంటి విలాసవంతమైన రైళ్లు ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నది. అత్యంత సరసమైన రవాణా సాధనాల్లో ఒకటిగా, అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉంది. విభిన్న సంస్కృతులు, భాషలు, భౌగోళిక ప్రాంతాలను ఒకదానితో ఒకటి కలుపుతూ, దేశ ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నది. తమ వేగంతో కొన్ని రైళ్లు, సదుపాయాలతో మరికొన్ని, దేశంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానిస్తూ ఇంకొన్ని రైళ్లు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కానీ, ఒక రైలు మాత్రం ఒక్క చోట కూడా ఆగకుండా అత్యధిక దూరం (Longest Non-Stop Train) ప్రయాణిస్తూ గుర్తింపును తెచ్చుకున్నది. అదే తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (Trivandrum-Hazrat Nizamuddin).
3 వేల కి.మీ.. 3 రోజుల ప్రయాణం..
కేరళ క్యాపిటల్ తిరువనంతపురం (Thiruvananthapuram), దేశ రాజధాని ఢిల్లీని (Delhi) కలుపుతూ సుమారు 3149 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది తన గమ్యస్థానాన్ని చేరడానికి 3 రోజులు పడుతుంది. ఈ రైలు ఒక్క చోట కూడా ఆగకుండా ఏకబిగిన 528 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తన ప్రయాణ మార్గంలో రాజస్థాన్‌లోని కోటా (Kota) నుంచి గుజరాత్‌లోని వడోదర (Vadodara) మధ్య ఎక్కడా ఆగకుండా దూసుకెళ్తుంది. ఈ దూరాన్ని చేరడానికి ఈ రైలుకు సుమారు 6.30 నుంచి 7 గంటల సమయం పడుతుంది. తద్వారా దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన నిరంతరాయ రైల్వే మార్గాలలో ఒకటిగా నిలిచింది.

రాజధాని ఎక్స్‌ప్రెస్..
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు దేశ రాజధాని ఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజధానులతో లేదా రాష్ట్రాన్ని పెద్ద నగరాలతో కలుపుతుంది. పూర్తిగా ఏసీ బోగీలు కలిగిన ఈ ప్రీమియం రైలుకు భారతీయ రైల్వే నెట్‌వర్కులో అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. 1969 మార్చి 1న తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను న్యూఢిల్లీ-హౌరా మధ్య ప్రారంభమైంది. ఈ రెండు స్టేషన్ల మధ్య 1451 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 17.20 గంటల్లోనే చేరుకున్నది. ఆ తర్వాత 1972లో ముంబై సెంట్రల్-ఢిల్లీ మధ్య రెండో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. 1992 వరకు దేశంలో ఈ రెండు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైట్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ట్రాక్‌ల అభివృద్ధితో క్రమంగా అన్ని రాష్ట్రాల రాజధానులు లేదా పెద్ద నగరాలకు ఈ ప్రీమియం సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 24 జతల రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Train Accidents | రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
మే 20, 2026

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Rajdhani Express | షార్ట్ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



