Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka | దేశ రాజధాని ఢిల్లీలో జరుగున్న స్వచ్ఛ భారత్ మిషన్ (Swatch Bharat Mission) ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాల్గొననున్నారు.
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో జరుగున్న స్వచ్ఛ భారత్ మిషన్ (Swatch Bharat Mission) ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాల్గొన్నారు. విజ్జాన్ భవన్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రులు హాజరయ్యారు.. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం ఈ సమావేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం ఇప్పటికే కేంద్ర మంత్రికి అధికారికంగా సమాచారం అందించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఉప ముఖ్యమంత్రితో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎంవో సెక్రటరీ మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు ఢిల్లీకి బయలుదేరి వేళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. స్వచ్ఛ భారత్ సమావేశంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, కేంద్ర బొగ్గు శాఖ మంత్రులతో పాటు మరికొందరు కీలక నేతలను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విద్యుత్, బొగ్గు రంగానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు.
డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రులతో జరిపే చర్చల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్ తదితర ఉన్నతాధికారులు కూడా ఢిల్లీకి వెళ్లారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



