Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!
Elephant poop | ఏనుగు పేడ నుంచి సేకరించిన గింజలతో తయారైన కాఫీని ఎప్పుడైనా తాగారా..? పోనీ ఇలాంటి కాఫీ ఒకటి ఉంటుందన్న విషయమన్న తెలుసా..? అవునండీ మీరు విన్నది నిజమే. ఏనుగు పేడ (Elephant poop)తో కూడా కాఫీని తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన కప్పు కాఫీ ధర ఏకంగా రూ.రూ.4,700 (50 డాలర్లు) ఉంటుందట.
Elephant poop | కాఫీ.. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అదో ఎమోషన్. ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ కడుపులో పడందే రోజు గడవదు కొందరికి. కాఫీల్లో చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా.. కాఫీ బెర్రీల లోపల ఉండే గింజలను సేకరించి, వాటిని ఎండబెట్టి, వేగించి, పొడి చేయడం ద్వారా కాఫీ పౌడర్‌ను తయారు చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఏనుగు పేడ నుంచి సేకరించిన గింజలతో తయారైన కాఫీని ఎప్పుడైనా తాగారా..? పోనీ ఇలాంటి కాఫీ ఒకటి ఉంటుందన్న విషయమన్న తెలుసా..? అవునండీ మీరు విన్నది నిజమే. ఏనుగు పేడ (Elephant poop)తో కూడా కాఫీని తయారు చేస్తారు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఇక దీని తయారీ విధానం, ధర తెలిస్తే మాత్రం షాకవుతారు.
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ 'ఎలిఫెంట్ డంగ్ కాఫీ' (ఏనుగు మలం కాఫీ) థాయ్‌లాండ్ (Thailand)లోని సూరిన్ అనే ఒక చిన్న ప్రావిన్స్‌లో 'బ్లాక్ ఐవరీ కాఫీ' (Black Ivory Coffee) పేరుతో తయారు చేస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ రకాల్లో ఒకటి. దీని ధర కిలోకు దాదాపు 2,000 డాలర్ల వరకు ఉంటుంది. ఈ కాఫీ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని రెస్క్యూడ్ ఎలిఫెంట్స్ మలంతో తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన కప్పు కాఫీ ధర ఏకంగా రూ.రూ.4,700 (50 డాలర్లు) ఉంటుందట. వినడానికి ఆశ్చర్యంగా, విడ్డూరంగా ఉన్నా ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన, ఖరీదైన కాఫీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది మరి.
ఎందుకింత ఖరీదు..?
ఈ కాఫీ అంత రేటు ఉండటానికి దాన్ని సేకరించే విధానమే కారణం. ఈ కాఫీ గింజలను ఏనుగు శరీరంలో మహజసిద్ధంగా ఫెర్మెంటేషన్ చేస్తారు. తొలుత కొన్ని కాఫీ గింజల్ని సేకరించి.. వాటిని అన్నం, అరటిపండ్లు, పండ్ల రసంతో కలిపి ఏనుగులకు ఆహారంగా ఇస్తారు. ఇలా ఇచ్చిన ఆహారం జీర్ణమయ్యే సమయంలో కాఫీ గింజలు కూడా ప్రత్యేక ప్రక్రియకు లోనవుతాయి. ఏనుగులు ఈ ఆహారాన్ని తిన్న 15-17 గంటల తర్వాత మలవిసర్జన చేస్తాయి. అలా వచ్చిన మలం నుంచి పులిసిన కాఫీ గింజలను వేరు చేసి శుభ్రపరుస్తారు. ఆ తర్వాత వాటిని ప్రాసెస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కాఫీకి ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తుంది. కాఫీ తయారీకి ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టే దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ. ఈ కాఫీకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీగా గుర్తింపు ఉంది. ఈ స్పెషల్ కాఫీ చాక్లెట్, నట్స్, మట్టి సువాసన కలగలిసిన ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. ఈ పద్ధతి వల్ల ఏనుగులకు కూడా ఎలాంటి హానీ ఉండదని తయారీ సంస్థలు చెబుతున్నాయి.
Also Read..
ఉద్ధవ్ సేనకు షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు రెబల్ ఎంపీలు
ప్రేమలత విజయకాంత్‌పై పన్నీర్ సెల్వం ఫన్నీ పంచ్.. పగలబడి నవ్విన సభ్యులు
ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ






