Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ – డిజాస్టర్ టాక్‌తో నలభై ఐదు కోట్ల కలెక్షన్స్
అభిమాని హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తోన్నాడు కన్నడ హీరో దర్శన్. కాగా దర్శన్ నటించిన కన్నడ మూవీ ది డెవిల్ గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ది డెవిల్ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ఏ ఓటీటీలో...ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
Darshan | అభిమాని హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ గత రెండేళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడనే ఆరోపణలతో రేణుకాస్వామి అనే అభిమానిని దర్శన్ తన మనుషులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈకేసులో దర్శన్, పవిత్రా గౌడ తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ బెయిల్‌పై రిలీజయ్యారు. కానీ సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయడంతో మళ్లీ జైలుకు వెళ్లారు.
డిజాస్టర్...
రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యే టైమ్‌లో ది డెవిల్ సినిమా చేస్తోన్నారు. ఈ సినిమా సెట్స్‌లోనే దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై రిలీజైన తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తిచేశారు. దర్శన్ జైలులో ఉన్న టైమ్‌లోనే గత ఏడాది డిసెంబర్‌లో ది డెవిల్ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా డిజాస్టర్‌గా నిలిచింది. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. 45 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది.
ఓటీటీలోకి...
థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాత ది డెవిల్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ5 ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. త్వరలోనే దర్శన్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సోమవారం జీ5 ఓ పోస్ట్ పెట్టింది. జూన్ 26 నుంచి ది డెవిల్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హీరోగా...విలన్‌గా...
ది డెవిల్ మూవీలో దర్శన్ డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. హీరోగా, విలన్‌గా రెండు పాత్రలు చేశాడు. రచనా రాయ్ హీరోయిన్‌గా కనిపించిన ఈ సినిమాలో మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ దర్శకత్వం వహించాడు.
సీఎం పదవి కోసం...
అవినీతి ఆరోపణల కారణంగా సీఎం రాజశేఖర్ జైలుకు వెళతాడు. రాజశేఖర్ స్థానంలో అతడి కొడుకు కృష్ణ పార్టీ ప్రచారం బాధ్యతలు చేపడతాడు. మంచి పనులతో ప్రజలకు దగ్గరవుతాడు. అనుకోకుండా కృష్ణ...సీఎం కొడుకు కాదనే నిజం తెలుస్తుంది. అసలు కొడుకు గణేష్ ఫారిన్ నుంచి వచ్చి కృష్ణకు ఎదురుతిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? గణేష్, కృష్ణ ఒకే పోలికలతో ఉండటానికి కారణమేమిటి అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Malayalam OTT | ఓటీటీలోకి మైండ్ బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో రిలీజ్
ఆగస్టు 25, 2026

Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ – ఓటీటీలోకి వచ్చేస్తోన్న అలియాభట్ స్పై థ్రిల్లర్ మూవీ
ఆగస్టు 23, 2026

Taapsee | థియేటర్లలో కాదు…నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ



