Shiv Sena UBT Split | ఉద్ధవ్ సేనకు షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు రెబల్ ఎంపీలు
Shiv Sena UBT Split | ఊహించిందే జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు రెబల్ ఎంపీలు ఇవాళ అధికారికంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనలో చేరారు.
Shiv Sena UBT Split | ఊహించిందే జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) చీలిపోయింది. ఆపరేషన్ టైగర్‌లో (Operation Tiger) భాగంగా ఆ పార్టీకి చెందిన ఆరుగురు రెబల్ ఎంపీలు ఇవాళ అధికారికంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనలో చేరారు. షిండే వర్గంలో చేరిన వారిలో ఓంరాజే నింబాల్కర్, సంజయ్ దినా పాటిల్, సంజయ్ జాదవ్ , సంజయ్ దేశ్‌ముఖ్, నాగేష్ పాటిల్ అష్టికర్, భావూసాహెబ్ వాక్‌చౌరే ఉన్నారు. వారంతా ఏక్‌నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. "ఆరుగురు పులులు ఇక్కడికి వచ్చేశాయి. వీరంతా ఇప్పుడు నిజమైన శివసేన కుటుంబంలో చేరారు. వీరికి నేను స్వాగతం పలుకుతున్నాను" అని అన్నారు. గతంలో విల్లు-బాణం గుర్తును, శివసేన పార్టీని కాపాడుకునేందుకు తిరుగుబాటు చేసినట్లు ఈ సందర్భంగా ఏక్‌నాథ్ షిండే గుర్తు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు రెండో దశ ప్రారంభమైందన్నారు.
కాగా, 2022లో శివసేనను చీల్చి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టిన ఏకనాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి సీఎం కుర్చీ ఎక్కారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధిక మెజారిటీ రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యారు. ప్రస్తుతం షిండే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు అసెంబ్లీ వేదికగా పార్టీని చీల్చిన షిండే.. ఇప్పుడు లోక్‌సభ వేదికగా రెండోసారి అలాంటి వ్యూహాత్మక దెబ్బ కొట్టారు.
ఏమిటీ 'ఆపరేషన్ టైగర్'?
ప్రస్తుతం శివసేన (యూబీటీ)కు మొత్తం తొమ్మిది మంది ఎంపీలు ఉండగా.. అందులో ఏకంగా ఆరుగురు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఈ రెబల్స్ వెనుక షిండే క్యాంపు అమలు చేస్తున్న రాజకీయ వ్యూహమే ఈ 'ఆపరేషన్ టైగర్'.
జూన్ 16న దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకున్న ఈ ఎంపీలు నోయిడాలోని ఓ హోటల్‌లో బస చేశారు. మరుసటి రోజు ఉదయం వేర్వేరుగా స్పీకర్ ఓం బిర్లాను కలిసి తాము షిండే వర్గంతో విలీనం అవుతున్నట్లు లేఖ ఇచ్చారు. పార్లమెంట్‌లో తమ సీటింగ్ అరేంజ్‌మెంట్ మార్చాలని కూడా కోరారు. ఆ తర్వాత వెంటనే చెన్నై, వారణాసి, పుణె లాంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ మీటింగ్ కోసం మళ్లీ ఒకచోట చేరి అధికారికంగా షిండే వర్గంలో చేరారు.
Also Read..
లక్నో కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం ఘటనలో 11 మంది దుర్మరణం
ప్రేమలత విజయకాంత్‌పై పన్నీర్ సెల్వం ఫన్నీ పంచ్.. పగలబడి నవ్విన సభ్యులు
మత్తు వదలండి.. మైదానాలు చేరండి.. యువతకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
- ●UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం
- ●Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
- ●Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
- ●Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
- ●Fake DSP Arrest Hyderabad | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ 'డీఎస్పీ'కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ

UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం

Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!






