Online Dating App | డేటింగ్ యాప్‌తో ట్రాన్స్‌జెండర్ల కొత్త మోసం.. యువకులను ట్రాప్ చేసి దోపిడీ
Online Dating App | బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ (Online Dating App) ద్వారా ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్న ట్రాన్స్‌జెండర్లు (transgenders) ఏకంగా రూ.20 లక్షలు కాజేశారు.
Online Dating App | త్రినేత్ర న్యూస్ : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (cybercrimes) విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా స్కామ్‌తో కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఫెడెక్స్ (FedEx), డిజిటల్ అరెస్టులంటూ అమాయకులను మోసగించిన నేరగాళ్లు తాజాగా తమ రూటు మార్చుకున్నారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ (Online Dating App) ద్వారా కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లే (transgenders) ఎక్కువగా ఈ తరహా మోసాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డేటింగ్ యాప్‌ల ద్వారా యువకులను ట్రాప్ చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేసే కొత్త రకం స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో వెలుగు చూసింది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్న ట్రాన్స్‌జెండర్లు ఏకంగా రూ.20 లక్షలు కాజేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
చంద్ర లేఅవుట్ (Chandra Layout)లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఊరెళ్లాడు. ఆ సమయంలో తన ఇంటిని స్నేహితుడు హర్షవర్ధన్‌కు అప్పగించాడు. అదే సమయంలో హర్షవర్ధన్‌కు డేటింగ్ యాప్ ద్వారా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్ చేసుకునేవారు. అలా ఆ మహిళను హర్షవర్ధన్ తన ఫ్రెండ్ ఇంటికి ఆహ్వానించాడు. అలా ఇంటికి వచ్చిన మహిళను హర్షవర్ధన్ లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి వచ్చాక మాస్క్ తీసేయడంతో అతడికి ఊహించని షాక్ తగిలింది. తాను ఆహ్వానించింది మహిళను కాదు ఓ ట్రాన్స్‌జెండర్‌ని అని తెలుసుకున్న అతడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరో ట్రాన్స్‌జెండర్ కూడా అక్కడికి వచ్చింది. ఇద్దరూ కలిసి అతడిని కత్తితో బెదిరించి ఇంటిని దోచుకున్నారు. బెడ్‌రూమ్ తలుపు పగలగొట్టి, అల్మారాలో దాచి ఉంచిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. నిందితులు సుమారు రూ.20 లక్షల విలువ చేసే 226 గ్రాముల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఇంటి యజమాని వెంటనే ఊరి నుంచి తిరిగి నగరానికి వచ్చాడు. ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు నజియా, సయ్యద్ మౌషిన్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే.. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 28, 2026

DK Shivakumar Warning IT Firms | కన్నడ వారికి ఉద్యోగాల్లో మొండిచెయ్యి చూపిస్తే ఊరుకోం
అక్టోబర్ 25, 2026

Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●Sara Ali Khan | కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు - చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్
- ●Simhastha Kumbh | రేపటి నుంచి సింహస్థ కుంభమేళా షురూ.. 2027లో నాలుగు అమృత స్నానాలు ఎప్పుడంటే?
- ●Gig Workers | గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత.. జాతీయ బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం..
- ●IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచింగ్ టీమ్.. బ్యాటింగ్ కోచ్ ఉతప్ప
- ●Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు
- ●Ramchandar Rao | మూసీ ప్రక్షాళన ఓకే.. పేదల ఇళ్లు తీసేస్తామంటేనే ఒప్పుకోం

Sara Ali Khan | కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు - చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్

Simhastha Kumbh | రేపటి నుంచి సింహస్థ కుంభమేళా షురూ.. 2027లో నాలుగు అమృత స్నానాలు ఎప్పుడంటే?

Gig Workers | గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత.. జాతీయ బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం..

IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచింగ్ టీమ్.. బ్యాటింగ్ కోచ్ ఉతప్ప



