త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | వీధి కుక్కల తరలింపు ఆదేశాల ఉపసంహరణకు సుప్రీం కోర్టు నిరాకరణ

Supreme Court | వీధి కుక్క‌ల (stray dogs) అంశంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను త‌ర‌లించాలంటూ గ‌తంలో ఇచ్చిన ఆదేశాల ఉపసంహరణకు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు (Supreme Court) నిరాక‌రించింది.

D

National | Published On May 19, 2026, 11.45 am IST

Supreme Court | వీధి కుక్కల తరలింపు ఆదేశాల ఉపసంహరణకు సుప్రీం కోర్టు నిరాకరణ
Advertisement

Supreme Court | వీధి కుక్క‌ల (stray dogs) అంశంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను త‌ర‌లించాలంటూ గ‌తంలో ఇచ్చిన ఆదేశాల ఉపసంహరణకు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు (Supreme Court) నిరాక‌రించింది. బ‌హిరంగ ప్ర‌దేశాల నుంచి వీధి కుక్క‌ల‌ను త‌ర‌లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఆదేశాలు అమలుచేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు వీధి కుక్క‌ల త‌ర‌లింపుపై ఇచ్చిన ఉత్తర్వుల‌ను సవరించాలంటూ దాఖలైన అన్ని పిటిష‌న్ల‌ను న్యాయ‌స్థానం కొట్టివేసింది.

వీధి కుక్కల సమస్యపై గ‌తేడాది న‌వంబ‌ర్‌లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాలు సహా పబ్లిక్‌ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. వాటిని పట్టుకున్న తర్వాత తిరిగి అదే ప్రదేశాల్లో వదలకూడదని స్పష్టం చేసింది. షెల్ట‌ర్ల‌కు త‌ర‌లించాల‌ని సూచించింది. ఈ మేర‌కు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ జంతు సంక్షేమ సంఘాలు పిటిష‌న్ దాఖ‌లు చేశాయి. ఈ పిటిష‌న్ల‌పై నేడు విచార‌ణ జ‌రిపిన కోర్టు.. గ‌తంలో పెట్టిన ఆంక్ష‌లు అమ‌ల్లోనే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా వీధి కుక్క‌ల దాడుల వ‌ల్ల పెరుగుతున్న ముప్పును నొక్కి చెప్పింది.

పిల్ల‌లు, వృద్ధులు, చివ‌రికి అంత‌ర్జాతీయ ప్ర‌యాణికులు కూడా వీధికుక్క‌ల దాడుల‌కు గుర‌వుతున్న ఘ‌ట‌న‌ల‌ను ధ‌ర్మాస‌నం ప్ర‌స్తావించింది. ఇలాంటి క‌ఠిన‌మైన క్షేత్ర‌స్థాయి వాస్త‌వాల‌ను న్యాయ‌స్థానాలు విస్మ‌రించ‌లేవ‌ని పేర్కొంది. వీధి కుక్క‌ల వ‌ల్ల జ‌రిగే దాడుల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని కోర్టు వ్యాఖ్యానించింది. గౌరవంతో కూడిన జీవన హక్కులో కుక్కల దాడుల భయం లేకుండా జీవించే హక్కు కూడా భాగమేనని ధర్మాసనం పేర్కొంది. ఈ మేర‌కు వీధి కుక్క‌ల వివాదానికి సంబంధించిన కేసులో దాఖ‌లైన అన్ని పిటిష‌న్ల‌ను కోర్టు కొట్టివేసింది. వీధి కుక్క‌ల అంశంలో గ‌తంలో ఇచ్చిన ఆదేశాలు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం ప్ర‌భుత్వాల క‌ర్త‌వ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. త‌మ ఆదేశాల‌ను దిక్క‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. రేబిస్‌ సోకిన, విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలకు కారుణ్య మరణం కల్పించేందుకు సుప్రీం అనుమతించింది.

Also Read..

భార‌త ఆర్మీకి మ‌రింత బూస్ట్‌.. రూ.3,600 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజ‌రైన‌ డిప్యూటీ సీఎం

భార‌త ఆర్మీకి మ‌రింత బూస్ట్‌.. రూ.3,600 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం

Advertisement
Advertisement