త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apache Helicopter | భార‌త ఆర్మీకి మ‌రింత బూస్ట్‌.. రూ.3,600 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం

Apache Helicopter | భారత్‌-అమెరికా మ‌ధ్య‌ రక్షణ సంబంధాలు మరింత బ‌ల‌ప‌డ్డాయి. భారత సైనిక సామ‌ర్థ్యాన్ని పెంచే దిశగా అమెరికా తాజాగా కీల‌క నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.3,600 కోట్ల (428.2 మిలియన్ డాలర్లు) విలువైన రెండు రక్షణ ఒప్పందాలకు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది.

D

National | Published On May 19, 2026, 11.10 am IST

Apache Helicopter | భార‌త ఆర్మీకి మ‌రింత బూస్ట్‌.. రూ.3,600 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
Advertisement

Apache Helicopter | భారత్‌-అమెరికా మ‌ధ్య‌ రక్షణ సంబంధాలు మరింత బ‌ల‌ప‌డ్డాయి. భారత సైనిక సామ‌ర్థ్యాన్ని పెంచే దిశగా అమెరికా తాజాగా కీల‌క నిర్ణయం తీసుకుంది. భారత్‌ అమ్ములపొదిలో ఇప్ప‌టికే సేవ‌లందిస్తున్న అపాచీ హెలికాప్టర్లు (Apache Helicopters), ఎం-777 ఏ2 అల్ట్రా లైట్ హోవిట్జర్ల (M-777 A2 ultra-light howitzers) నిర్వ‌హ‌ణ‌, సాంకేతిక స‌హ‌కారం కోసం (support package) సుమారు రూ.3,600 కోట్ల (428.2 మిలియన్ డాలర్లు) విలువైన రెండు రక్షణ ఒప్పందాలకు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది.

ఈ ఒప్పందాల్లో మొదటిది M777A2 అల్ట్రా-లైట్ హోవిట్జర్ల దీర్ఘకాలిక నిర్వహణకు సంబంధించింది. దీని అంచ‌నా వ్య‌యం దాదాపు రూ.2,217 కోట్లు (230 మిలియన్ డాలర్లు). ఈ ప్యాకేజీలో విడిభాగాలు, మరమ్మతులు, శిక్షణ, సాంకేతిక సాయం, ఫీల్డ్ సర్వీస్ వంటివి ఉంటాయి. ఈ ఒప్పందానికి బీఏఈ సిస్టమ్స్ (BAE Systems) ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించనుంది.

ఇక రెండో ఒప్పందం AH-64E అపాచీ హెలికాప్టర్ల నిర్వహణకు సంబంధించినది. దీని అంచ‌నా వ్య‌యం రూ.1,909 కోట్లు (198.2 మిలియన్ డాలర్లు). ఇందులో ఇంజినీరింగ్, సాంకేతిక, లాజిస్టిక్స్ మద్దతు, సిబ్బందికి శిక్షణ వంటి సేవలు అందిస్తారు. బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు ఈ ఒప్పందానికి ప్రధాన కాంట్రాక్టర్లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాయి. ఈ రెండు ఒప్పందాలు ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి, రాజకీయ స్థిరత్వం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

అమెరికా ప్రభుత్వం, బోయింగ్‌తో కుదిరిన ఒప్పందం

కాగా, 2015లో అమెరికా ప్రభుత్వం, బోయింగ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు భారత వాయుసేన అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్‌లను కొనుగోలు చేసింది. 2020 జూలైలో అమెరికా వాటిని భారత్‌కు డెలివరీ చేసింది. అదే ఏడాది చివరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్ వచ్చినప్పుడు మరో 6 అపాచీ హెలికాప్టర్‌ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఆ 6 హెలికాప్టర్‌లకుగాను ఒప్పందంలో భాగంగా తొలి విడత మూడు హెలికాప్టర్‌లు 2024 మే, జూన్‌ నెలల్లో భారత్‌కు రావాల్సి ఉంది. స‌ప్లై చైన్‌లో అంతరాయాలు, అంతర్జాతీయంగా జియోపొలిటికల్‌ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఈ అపాచీ హెలికాప్టర్‌లు భారత్‌కు చేరుకోవడంలో ఆలస్యం జరిగింది. అత్యాధునిక అపాచీ ఏహెచ్‌-64ఈ అటాక్‌ హెలికాప్టర్లు గ‌తేడాది జూలై 21న భార‌త్‌కు చేరుకున్నాయి. ఈ హెలికాప్టర్‌లను శత్రుసేనలపై దాడులకు, గూఢచర్యానికి రెండు విధాలుగా వినియోగిస్తారు.

భారత్ వద్ద ఎన్ని అపాచీలు ఉన్నాయి..? వాటి విలువ‌..

భారత రక్షణ దళాల వద్ద మొత్తం 28 అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో 22 హెలికాప్టర్లు వాయుసేన వద్ద, 6 హెలికాప్టర్లు ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ వద్ద ఉన్నాయి. 22 అపాచీ హెలికాప్టర్ల కోసం 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. భార‌త్ ఒక్కో హెలికాప్టర్‌ను సగటున రూ.678 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఆ త‌ర్వాత‌ 2025 సంవత్సరం నాటికి ఈ హెలికాప్టర్ల రేట్లు గణనీయంగా పెరిగాయి. ఆ ఏడాది భారత్‌కు అమెరికా డెలివరీ చేసిన 6 అపాచీ హెలికాప్టర్ల మొత్తం విలువ దాదాపు రూ.4,168 కోట్లు (930 మిలియన్ డాలర్లు). అంటే ఒక్కో హెలికాప్టర్ ధర దాదాపు రూ.860 కోట్ల నుంచి రూ.948.5 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది.

Also Read..

ఉద్యోగార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు గ‌రిష్ట‌ వ‌యోప‌రిమితి పెంపు

ఈ సమ్మర్‌లో ఊటీ, మనాలి కాకుండా.. ఉత్తరాఖండ్‌లోని ఈ 'సీక్రెట్ వ్యాలీ'కి ప్లాన్ చేయండి

జలమండలి మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు.. భారీగా న‌గ‌దు, ఆస్తులు..!

Advertisement
Advertisement