త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి

KP Vivekananda | తొమ్మ‌ది త‌ల‌ల స‌ర్పం రంగనాథ్ అయితే ప‌ది త‌ల‌ల రావ‌ణాసురుడు సీఎం రేవంత్‌రెడ్డి అని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమ‌ర్శించారు. హైడ్రా తొమ్మిది తలల సర్పం అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందంటే వీళ్లు చేసిన అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు.

S

Telangana | Published On Jul 28, 2026, 1.52 pm IST

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
Advertisement
  • రేవంత్‌కు ఒక‌ వ్య‌క్తి ముఖ్య‌మో.. తెలంగాణ రాష్ట్రం ముఖ్య‌మో తేల్చుకోవాలి
  • హైడ్రా అరాచ‌కాల‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి
  • ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్‌

KP Vivekananda | త్రినేత్ర‌.న్యూస్‌: తొమ్మ‌ది త‌ల‌ల స‌ర్పం రంగనాథ్ అయితే ప‌ది త‌ల‌ల రావ‌ణాసురుడు సీఎం రేవంత్‌రెడ్డి అని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమ‌ర్శించారు. హైడ్రా తొమ్మిది తలల సర్పం అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందంటే వీళ్లు చేసిన అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఒక వ్యక్తి ముఖ్యమో లేదా తెలంగాణ రాష్ట్రం ముఖ్య‌మో తేల్చుకోవాల‌న్నారు. హైడ్రా అరాచ‌కాల‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

హైడ్రా క‌మిష‌న‌ర్‌ని తొమ్మ‌ది త‌ల‌ల స‌ర్పం అని హైకోర్టు అన్న‌దంటే మ‌న‌కు అర్థం అవుతున్న‌ది. హైడ్రా పేరుతో వీళ్లు ఎన్ని దాష్టికాలు, ఎన్ని దౌర్జ‌న్యాలు, ఎన్ని అరాచ‌కాలు చేశారో అని. రాష్ట్రంలోని అత్యున్న‌త న్యాయస్థానమే ఇలా అన్న‌దంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మైతుంది. రాష్ట్రంలో జ‌రిగిన దోపిడీ మామూలు దోపిడీ కాదు. చేసిన అన్యాయాలు, ఆక్ర‌మ‌ణ‌లు, అరాచ‌కాలు.. వీటి ద్వారా చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. గ‌త రెండున్న‌రేళ్లుగా రాష్ట్రంలో ఈ హైడ్రాను అడ్డుపెట్టుకొని ఎన్నో దారుణాలు చేశారు. క‌నిక‌రం లేకుండా పేద‌ల ఇండ్లు కూల్చారు అని వివేకానంద ఆవేద‌న చెందారు.

బీఆర్ఎస్ త‌ర‌ఫున ఈరోజు ఒక్క‌టే డిమాండ్ చేస్తున్నం. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి నిజంగా న‌మ్మ‌కం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి. ఈరోజు మీకు ఒక వ్య‌క్తి కావాల్నా? లేక‌పోతే తెలంగాణ రాష్ట్రం కావాల్నా? మీకు ఒక వ్య‌క్తి ముఖ్య‌మా? న్యాయ‌స్థానం ఇచ్చిన ఆదేశం ముఖ్య‌మా? న్యాయ‌స్థానాల‌ను గౌర‌వించాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రి రేవంత్‌పై ఉన్న‌ది. గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా హైడ్రా పేరుతో జ‌రిగిన అన్ని అరాచ‌కాల‌పైన సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతున్నాం అని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement