Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
Heavy Rains | నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు( Heavy Rains )కురిశాయి. మెదక్( Medak ), కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి.
Heavy Rains | త్రినేత్ర.న్యూస్ : నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు( Heavy Rains )కురిశాయి. మెదక్( Medak ), కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. ఈ జిల్లాలోని చెరువులు, వాగులు పొంగిపొర్లాయి.
నిన్న కురిసిన భారీ వర్షానికి మెదక్ జిల్లాలోని పాపన్నపేట( Papannapet )లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్( TGDPS ) వెల్లడించింది. చేగుంటలో 83.5, ములుగు జిల్లా వెంకటాపురంలో 74.8, భూపాలపల్లి జిల్లా పలిమేలలో 68.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ ప్రకటించింది.
ఇక హైదరాబాద్ నగరంలోనూ మోస్తరు వర్షం కురిసింది. దక్షిణ, తూర్పు హైదరాబాద్‌లో నిన్న రాత్రి వాన దంచికొట్టింది. క్యూర్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో 27 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఎల్‌బీనగర్‌లో 24.5, సరూర్‌నగర్‌లో 24.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ వెల్లడించింది.
మంగళవారం రాత్రి వరకు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ హెచ్చరిక నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
- ●iOS 27 | ఐఫోన్‌ను ఐఓఎస్ 27కు అప్డేట్ చేశారా.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది జాగ్రత్త..
- ●Mamata Banerjee | టీఎంసీ పేరు, గుర్తు గల్లంతు.. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మమతా బెనర్జీ
- ●RS Praveen Kumar | కనీసం మీ కలెక్షన్ బ్యాచ్లోనైనా ఒక్క ఎస్సీ అయినా ఉన్నడా?
- ●RBI | భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..? రుణం ఇక మరింత ప్రియం..
- ●Rejinagar Assembly bypoll | మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి
- ●Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?

iOS 27 | ఐఫోన్‌ను ఐఓఎస్ 27కు అప్డేట్ చేశారా.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది జాగ్రత్త..

Mamata Banerjee | టీఎంసీ పేరు, గుర్తు గల్లంతు.. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మమతా బెనర్జీ

RS Praveen Kumar | కనీసం మీ కలెక్షన్ బ్యాచ్లోనైనా ఒక్క ఎస్సీ అయినా ఉన్నడా?

RBI | భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..? రుణం ఇక మరింత ప్రియం..





