NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం
NEET Aspirant Dies | విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి (NEET Aspirant Dies) పాల్పడింది.
NEET Aspirant Dies | పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సమస్యల పరిశీలనకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయినప్పటికీ విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
మహారాష్ట్ర (Maharashtra)లోని అహల్యనగర్ (Ahilyanagar) జిల్లా జలాల్‌పూర్ గ్రామానికి చెందిన అంకిత సాంగ్లే (Ankita Sangle) (19)కి నీట్ పరీక్షలో 166 మార్కులు వచ్చాయి. దీంతో సదరు విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గరైంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అంకిత రూమ్‌లో ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో "నాన్న మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారు. అమ్మ, అన్నయ్య మీరు ప్రతి కష్టంలోనూ నాకు అండగా నిలిచారు. నాపై ఎంతో ప్రేమను చూపించారు. కానీ మీ కలను నేను నెరవేర్చలేకపోతున్నాను. నన్ను క్షమించండి. అన్నయ్యా అమ్మ, నాన్నలను జాగ్రత్తగా చూసుకో. వారికి ఏ లోటూ రానివ్వకు. నా ఆత్మహత్యకు మీరెవరూ బాధ్యులు కాదు" అని రాసింది. ఈ ఘటనపై పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read..
రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
- ●ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు
- ●Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..
- ●E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం

Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్

Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?

Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు





