Ponnam Prabhakar | ఇదొక వ్యక్తి రాజీనామా కాదు.. అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం
Ponnam Prabhakar | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. విద్యార్థుల శక్తి ముందు అహంకారపూరిత రాజకీయాలు తలవంచిన సందర్భమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గద్దె దిగడానికి ప్రధాన్ రాజీనామా తొలి మెట్టులాంటిదన్నారు.
- బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి ఇదే తొలి మెట్టు
- విద్యార్థులను అణచివేసే ప్రయత్నానికి ఇది గట్టి సమాధానం
- మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. విద్యార్థుల శక్తి ముందు అహంకారపూరిత రాజకీయాలు తలవంచిన సందర్భమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గద్దె దిగడానికి ప్రధాన్ రాజీనామా తొలి మెట్టులాంటిదన్నారు. విద్యార్థుల ఉద్యమం, ప్రతిపక్షాల పోరాటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒత్తిడి కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలని చేసిన ప్రతి ప్రయత్నానికి ఈ పరిణామం గట్టి సమాధానమని స్పష్టం చేశారు. ఈమేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ఐక్య పోరాటాల గెలుపిది..
రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును హరిస్తే ప్రజలు మరింత ఐక్యంగా పోరాడతారని కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయం. విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు, విద్యార్థుల నిరసనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం చివరకు ప్రభుత్వానికే నష్టాన్ని మిగిల్చింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే దేశ యువత తగిన సమాధానం చెబుతుందని ఈ ఉద్యమం నిరూపించింది అని పొన్నం కొనియాడారు.
ఇంకా బలమైన పోరాటాన్ని కొనసాగిస్తం..
ఈ రాజీనామా దేశ ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. విద్య, ఉపాధి, యువత భవిష్యత్తు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పూర్తిగా మార్చుకోవాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల హక్కులను రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు, యువజన సంఘాలకు, ప్రజాస్వామ్య శక్తులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి మరింత బలంగా పోరాటాన్ని కొనసాగిస్తాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!






