Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది – మహేష్‌బాబు నిర్మాత
సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన రావుబహదూర్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబు ప్రజెంటర్‌గా వ్యవహరించారు.
Entertainment | Published On Jul 28, 2026, 2.02 pm IST
Telugu OTT | సత్యదేవ్ హీరోగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రావుబహదూర్ విభిన్నమైన ప్రయోగంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీపా థామస్, వికాస్ ముప్పాల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిన్న సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబు ప్రజెంటర్‌గా వ్యవహరించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
జూలై నెల ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన రావుబహదూర్ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కమర్షియల్‌గా మాత్రం నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ ఖరారయ్యాయి. జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రావుబహదూర్ స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే సత్యదేవ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
సత్యదేవ్ యాక్టింగ్...
అనుమానం అన్నింటికంటే పెద్ద జబ్బు అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్, అతడి లుక్ డిఫరెంట్‌గా ఉన్నాయంటూ కామెంట్లు వచ్చాయి. రాజమౌళి, సందీప్ వంగా, నాని, నాగచైతన్య, ఆర్‌జీవీతో పాటు పలువురు సినీ ప్రముఖులు రావుబహదూర్ డిఫరెంట్ అటెంప్ట్ అంటూ ప్రశంసలు కురిపించారు. కానీ ఈ ప్రయోగాన్ని ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో దర్శకుడు విఫలం కావడం మైనస్‌గా మారింది. ఈ సినిమాకు స్మరణ్ సాయితో కలిసి విజయ్ ఏసుదాస్ మ్యూజిక్ అందించారు.
రావు బహదూర్ అనుమానం...
రామప్ప రావుబహదూర్ లివర్ క్యాన్సర్‌తో బాధపడుతుంటాడు. ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెబుతుంటారు. చాలా కాలంగా అతడిని ఓ అనుమానం వెంటాడుతుంటుంది. దానికి సమాధానం దొరికిన తర్వాతే చనిపోతానని అందరితో చెబుతుంటాడు రామప్ప. అదేమిటి? ప్రేమించి పెళ్లిచేసుకున్న రేణుకకు రామప్ప ఎందుకు దూరమయ్యాడు? రామ్మకు అతడి స్నేహితుడు ఆచారి ఎలాంటి సాయం చేశాడు అనే అంశాలతో రావుబహదూర్ మూవీ రూపొందింది.
రావుబహదూర్ కంటే ముందు సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్‌లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ రూపొందింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
- ●Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
- ●Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల
- ●CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి

Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..

Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు






